పర్సనల్ లోన్ తీసుకుని, వచ్చిన డబ్బును మీ కలలు నెరవేర్చు కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇందుకు గాను మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తమ కస్టమర్ల కోసం వివిధ రకాల బ్యాంకులు పర్సనల్ లోన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు పర్సనల్ లోన్ అందిస్తున్నాయి.

 

 

ఇకపోతే ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్స్ వైపే చాలా మంది చూస్తారు. ఈ పర్సనల్ లోన్ తీసుకునే ముందు ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో, ఏ బ్యాంక్ తక్కువ వడ్డీకి రుణం అందిస్తుందో చూడాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్‌క్లోజర్ చార్జీలు వంటి వాటిని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఇకపోతే పర్సనల్ లోన్స్ అనేవి అన్‌సెక్యూర్డ్ లోన్స్. ఎలాగంటే ఎలాంటి తనఖా లేకుండానే బ్యాంకులు రుణాలు అందిస్తాయి. కాబట్టి పర్సనల్ లోన్‌పై 9 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది.

 

 

ఇక ఆన్‌సెక్యూర్డ్ లోన్స్ కారణంగా పర్సనల్ లోన్ తీసుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుంది.. ఉద్యోగుల అవసరం నిమిత్తం అందుబాటులో ఉండి తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తున్న బ్యాంకులను గమనిస్తే.. అలహాబాద్ బ్యాంక్ తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తోంది. ఈ బ్యాంక్ పర్సనల్ లోన్స్‌పై 8.4 శాతం నుంచి 12.9 శాతం మధ్యలో వడ్డీని వసూలు చేస్తోంది. దీని తర్వాత ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 9.20 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

 

 

ఇక ఐడీబీఐ బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 9.65 శాతం నుంచి 12.4 శాతం మధ్యలో ఉంది. ఈ బ్యాంకులు మిగతా అన్ని బ్యాంకులకంటే అతి తక్కువ వడ్డీకే ఈ లోన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం పర్సనల్ లోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇంత తక్కువ వడ్ది అందిస్తున్న బ్యాంకులుగా ఇవి గుర్తింపు పొందాయి. మికే గనుక లోన్ కావాలనుకుంటే ఒక్క సారి మిగతా బ్యాంక్ లోన్ వడ్డీ ధరలు పరిశీలించుకుని ముందుకు వెళ్లగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: