భర్త తన భార్యకు ఆమె మాజీ ప్రియుడితో పెళ్లి చేస్తున్నాడు. ఇది ఎక్కడో విన్నట్లు వుందే అనుకుంటున్నారా?, విన్నట్లు కాదు చూసాం కూడా, ఎక్కడా అని అనుకుంటున్నారా?, 'కన్యాదానం' సినిమాలో శ్రీకాంత్ కు రచన ను ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పటికే ఉపేంద్ర తో ప్రేమలో ఉన్న రచన శ్రీకాంత్ ను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది, కొన్ని రోజుల తరువాత తన భార్య ప్రేమ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రచన ను ఉపేంద్ర కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడితో కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమా తరహాలోనే నిజ జీవితంలో ఒక సంఘటన జరిగింది. 

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో రాము (పేరు మార్చబడింది) మరియు బిందు (పేరు మార్చబడింది) లకు పెళ్లి జరిగింది. వృత్తి రీత్యా రాము ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో ఐటీ నిపుణుడు కాగా బిందు ఫ్యాషన్ డిజైనర్. పెళ్లి కి ముందే మరో వ్యక్తిని ప్రేమించిన బిందుకు ఈ వివాహం ఇష్టం లేదు, కానీ ఇంట్లో వాళ్ళు బలవంతం చెయ్యడంతో పెళ్ళికి ఒప్పుకుంది. వీరి కాపురం 7 ఏళ్ళు సాగింది. ఇక ఈ మధ్య తన సొంత ఊరు వెళ్లిన బిందుకు తన మాజీ ప్రియుడు గురించి తెలిసింది. తన ప్రియుడు తనపై ప్రేమను చంపుకోలేక ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలుసుకుంది. తన భర్త కు జరిగిందంతా చెప్పి తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా కోరింది.

 

తన భార్య ప్రేమ గాధ విన్న భర్త మొదట నిరాకరించాడు అయిన పట్టు విడువకుండా బిందు తన భర్త ను ఒప్పించి కోర్టు లో పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఇక కోర్టు విడాకులు తప్ప మంజూరు చేస్తుందనే నమ్మకంతో రాము తన భార్యను మాజీ ప్రియుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: