సాధార‌ణంగా చిన్నారులకు జలుబు, దగ్గు చేస్తే చెస్ట్‌కి విక్స్ రాస్తుంటాము. పెద్దవాళ్లు కూడా జలుబు చేసి ముక్కుదిబ్బడ వేస్తే విక్స్ వేపోరబ్ పీలుస్తుంటారు. దాంతో ఎంతో ఉపశమనంగా ఉంటుంది. జ‌లుబు, త‌ల‌నొప్పి, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నివారిణిగా ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొద్దిగా తీసుకుని సంబంధిత భాగాల్లో రాసుకుంటే వెంట‌నే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే ఒక్క జలుబు, దగ్గులకే కాదు విక్స్‌తో మరెన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..

 

కొద్దిగా విక్స్‌ను తీసుకుని చెవుల వెనుక‌, మోచేతుల‌పై, మెడ‌పై, మోకాళ్ల‌పై రాసుకుంటే కీట‌కాలు, పురుగులు, ఈగ‌లు వాల‌వు. విక్స్ డ‌బ్బాను ఓపెన్ చేసి ఆహార ప‌దార్థాల‌కు స‌మీపంలో ఉంచితే అక్క‌డ ఈగ‌లు వాల‌వు. వెల్లుల్లి రేకుల‌పై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వ‌ద్ద పెట్టుకుని గ‌ట్టిగా శ్వాస పీల్చాలి. దీంతో సైన‌స్ త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. పాదాల పగుళ్లకూ విక్స్ బాగా పనిచేస్తుంది. రాత్రి పూట పగిలిన పాదాలకు విక్స్ రాసి సాక్సులు వేసుకోవాలి. ఉదయాన్నే సాక్సులు తీసి వేడి నీటితో కాళ్లను కడుక్కుంటే తగ్గిపోతాయి.

 

రోజుకు క‌నీసం మూడు సార్లు విక్స్‌ను మొటిమ‌ల‌పై క్ర‌మం త‌ప్ప‌కుండా రాస్తుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం త‌డి ఆరిపోయి పొడిగా మారి ఇబ్బందులు పెడుతుంటే విక్స్ రాయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. చర్మం సాగిపోయి స్టెచ్ మార్క్‌లు ఏర్పడితే ఆయా ప్రదేశాల్లో విక్స్ రాయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే స్టెచ్ మార్క్స్ తగ్గి మృదువుగా మారుతుంది. కాలి వేళ్ల‌కు ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే ఆ ప్ర‌దేశంలో విక్స్ రాయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల‌ ఇన్‌ఫెక్ష‌న్స్‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: