పోర్న్ / సెక్స్ వీడియోస్ అంతర్జాలంలో రోజూ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. నిజానికి పోర్న్ సైట్లును చూసినంతగా మరేతర వెబ్సైట్లను ప్రజలు చూడరు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి... అవేంటంటే ప్రతి సంవత్సరము 15 టాప్ వెబ్ సైట్ ర్యాంకింగ్ లిస్టులో పోర్న్ వెబ్సైట్లు 3-4 వరకు ఉండటం. మన దేశంలో కూడా అడల్ట్ వెబ్ సైట్లలోని వీడియోస్ ను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు. అది చాలా బాధాకరం. ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న మనదేశంలో ఇటువంటి విషపూరితమైన అడల్ట్ కంటెంట్ ప్రవేశించి ఎంతోమంది మంచివాళ్లను కామాంధులుగా, నేరగాళ్లుగా మార్చి.. అబలల జీవితాలతో ఆడుకుంటున్నది.


నిజానికి మనము ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం అనే వాటిపైనే మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. మీ మనసుని/మెదడుని ఒక స్వచ్ఛమైన సముద్రంతో పోల్చుకోండి. పోర్న్ వీడియోస్ ని, ఇంకా ఇతర అసాంఘిక చర్యలను చెత్తతోని పోల్చండి. అడల్ట్ వీడియోస్ ని ఒకరోజు చూస్తే... స్వచ్ఛమైన మీ మెదడులో అది ఒక చెత్తలా పేరుకుపోతుంది. అలా మీరు ప్రతి రోజూ చూస్తూ ఉంటే.. చివరికి మీ మెదడు అడల్ట్ వీడియోస్ అనే చెత్తతో నిండిపోయి.. మిమల్ని దానికి బానిస చేసి మీ జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది. అవునండి! మద్యం తాగడం ఎంత ప్రమాదకరమో అటువంటి వీడియోస్ చూడడం అంతకంటే ఎక్కువ ప్రమాదం. చెల్లి, తల్లి, అక్క, పిన్ని అనే వావివరసలు మరచి వారిపై అత్యాచారం చేసిన నిందితుల విచారణలో ఏం తెలిసింది అంటే... ఆ నిందితులు అదేపనిగా పోర్న్ వీడియోస్ చూస్తున్నారని.


టెడ్ అనే ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్ .. ఎన్నో హత్యలు మానభంగాలు చేసి చివరికి పోలీసుల చేతికి చిక్కి చాలా సంవత్సరాలు జైల్లో గడుపుతాడు. అయితే టెడ్ ని ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి మలమల మాడ్చి చంపే ముందురోజ.. అతన్ని ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ లో ఆ సీరియల్ కిల్లర్ ఏం చెప్పాడంటే... "నాకు 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు.. నేను ఒక లోకల్ స్టోర్ లో ఒక సాఫ్ట్ కోర్ పోర్న్ వీడియో ని చూసాను. తర్వాత క్రమక్రమంగా వాటిని ఎక్కువగా చూడటం మొదలు పెట్టాను. కొంతకాలం తర్వాత పోర్నోగ్రఫీ కు బానిసనయ్యాను. ఎంతసేపు చూసిన ఇంకా చూడాలనిపించేది. మాదక ద్రవ్యాలకు బానిసలయ్యినా వారి లాగా నేను కూడా వాటికి బానిసనయ్యాను. బాగా హార్డ్ కోర్ సెక్స్ వీడియోస్ చూసి నాకు గొప్ప ఫీల్ రావాలని తపనపడేవాడిని. నేను నా వ్యక్తిగత అనుభవంతో చెపుతున్నాను.. ఎవరైతే సెక్స్ వీడియోస్ చూడడం ప్రారంభిస్తారో... వారి ప్రవర్తన... మాటల్లో చెప్పలేనంత ఘోరంగా తయారవుతుంది. కొంతమంది నేను సెక్స్ వీడియోస్ ని ఎన్నో చూసాను కాని నార్మల్గానే ఉన్నానని చెప్తారు. నేను కూడా కొన్ని రోజుల వరకు ఫ్రెండ్స్ తో గడుపుతూ నార్మల్ గానే ఉన్నాను... కానీ ఎప్పుడైతే...నేను ఒంటరిగా.. ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా సెక్స్ వీడియోస్ ని చూడడం ప్రారంభించానో.. అప్పటి నుంచి నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను జైల్లో గడిపిన సమయంలో ఎంతోమంది నేరస్తులను కలిసాను. ఆ నేరస్తులల్లో ప్రతి ఒక్కడు పోర్న్ వీడియోస్ కు అడిక్ట్ అయ్యినవాడే. పోర్నోగ్రఫీ ఎంతటి మంచివాడినైనా నాశనం చేస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లో ఉన్నపుడు చెడ్డ అలవాట్ల నుంచి దూరంగా ఉంచారు.. కానీ నేను బయట ఏం చేస్తున్నానో తెలుసుకోలేక పోయారు. అందరి తల్లిద్రండులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.. మీ పిల్లలను పోర్నోగ్రఫీ నుంచి వీలైనంత దూరంగా ఉంచండి. అవి మీ పిల్లల మెదడును, మనసుని ఆ తర్వాత ప్రపంచాన్ని నాశనం చేస్తాయి." అంటూ టెడ్ చెప్పాడు.

అవును.. అడల్ట్ వీడియోస్ ఒక్కసారి అలవాటయిపోతే.... వాటిని ఇంకా చూడాలనిపిస్తుంది. గే, లెస్బియన్, ఫ్యామిలీ, ఇంకా చెప్పుకోలేనినటువంటి రిలేషన్ షిప్ ని ఇద్దరి పోర్న్ స్టార్స్ మధ్య వాడి సెక్స్ వీడియోస్ ని తయారుచేసి... వాటిని.. పోర్న్ ఇండస్ట్రీస్.. ఇంటర్నెట్ లో విడుదల చేస్తున్నాయి. ఇక ఈ వీడియోస్ అదే పనిగా చూసిన కొంతమంది ప్రవర్తన లేక వైఖరి ఘోరంగా మారుతుంది. అలాంటి వాళ్లు ఏ ఆడవారిని చూసినవారు కామవాంఛతోనే చూస్తారు... వాళ్ళకి అలా చెడుగా చూడడం సహజం అవుతుంది. ప్రతిరోజు పోర్న్ వీడియోస్ చూడటం వలన... మెదడు సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి మంచి ఎదో చెడు ఎదో కూడా తెలుసుకోలేనంత కామ పిచ్చివాళ్ళ అయిపోతారు.

ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే.. ఎవరైతే వారికి వివాహం అయ్యేంత వరకు పోర్న్ వీడియోస్ చూడరో... వారు శృంగారాన్ని తమ భాగ్యస్వామితో బాగా ఎంజాయ్ చేస్తారట. ఇంకా... అవి చూడని వారి విలువలు మంటగలిచిపోవు. సైన్స్ ప్రకారం.... పోర్న్ చూడటం వలన శృంగార సామర్థ్యం విపరీతంగా తగ్గిపోతుంది. అవి చూసే వారి ఒక్క జీవిత లక్షాన్ని కూడా సాధించలేక భూమికి భారం అయిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: