తాడుగు కి బానిస అయితే నష్టపోయేది కేవలం తాగిన ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు అతడిని నమ్ముకుని ఉన్న కుటుంభం కూడా తీవ్రంగా నష్టపోతుంది. ప్రతీ రోజు ఎదో ఒక మూల మద్యం బారిన పడి మరణించే వారు ఉంటూనే ఉంటారు. వారి కుటుంభాలు సైతం రోడ్డున పడుతూనే ఉంటాయి. అయినా తాగుబోతులు మారరు. ఎన్నో విధాలుగా వారిని మార్చడానికి ఇంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

 

ఈ తాగుడు రోగం మాన్పించడానికి ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా అధ్యయనాలు చేసినా ఉపయోగం మాత్రం సూన్యం. మరి తాగే వాళ్ళు లేకపోతే ఖజానా నిండేది ఎలా అనే కారణమో ఏమో కానీ మొత్తానికి తాగుడికి విరుగుడు మాత్రం కొన్నేళ్లుగా తెలియడంలేదు అనేది మాత్రం సత్యం. ఇదిలాఉంటే. తాజాగా లండన్ లోని శాస్త్రవేత్తలు ఈ తాగుడికి తాము విరుగుడు కనుగొన్నామని అంటున్నారు.

 

“కెటామీన్” అనే  మందులో తాగుడు మాన్పించే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వారు కనిపెట్టారట. సాధారణంగా కెటామీన్ మందుని ఆపరేషన్స్ చేసే సమయంలో వాడే మత్తు మందుగా వాడుతారట. అయితే ఈ మెడిసిన్ ని వారానికి 14 లీటర్ల మద్యం తాగే అలవాటు ఉన్న సుమారు 55 మంది పురుషులు , 35 మంది మహిళలపై సుమారు 9 నెలల పాటు ప్రయోగించగా చివరికి మద్యం తాగే కోరికలు వారి మెదడుకు వెళ్లలేదని తేలిందట దాంతో క్రమక్రమంగా మద్యం తాగే అలవాటు వారికి దూరం అవ్వడం గుర్తించారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: