ఒక అమర ప్రియుడు తన ప్రియరాలి కోసం చాలా త్యాగం చేసాడు. కానీ చివరికి ఆ ప్రియురాలు మాత్రం తనని వదిలేసి వెళ్ళిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే   ఆ యువకుడు హైదరాబాద్ కు   2009 లో బీటెక్ చేయడం కోసం రావడం జరిగింది. ఆమెను మొదటిసారి అక్కడే కలిశాను. మా క్లాస్‌మెట్‌ తను పేరు సుష్మా. బాగా మాట్లాడుకునే వాళ్ళం. ఒక రోజు ప్రపోజ్ కూడా చేశాను. మనం ఫ్రెండ్స్ అంది. నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా ఫ్రెండ్లీగా నీతో ఉండలేను అని తనకి దూరంగా ఉన్నాను అప్పటి నుంచి. తర్వాత కొన్ని రోజులకు తను నా ప్రేమను ఒప్పు కోవడం జరిగింది. మా కాలేజీ అంతా మా ప్రేమ గురించి తెలుసు. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. 

 


కొన్ని రోజులకు కాలేజీ క్యాంపస్ సెలక్షన్ నిర్వహించారు.  ఇంటర్వ్యూలో మంచి జాబ్ వచ్చింది. ఢిల్లీలో ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. మంచి జీతం, మంచి జీవితం ఉంది. కానీ నీకు దూరంగా ఉండలేను మీరు హైదరాబాద్ వచ్చేయ్ అని అంది. సుష్మ ప్రేమకోసమే అంతా మంచి జీతం ఇస్తున్న కంపెనీ ని వదులుకొని హైదరాబాదు వచ్చేసాను. తన కోసం ఏమి ఆలోచించకుండా జాబ్ వదిలేసి కూడా వచ్చాను. నేను తన కోసం అన్ని వదిలేసి రావడం జరిగింది. 

 

నేను తీరా హైదరాబాదు వచ్చేసరికి. తను మాత్రం నన్ను వదిలేసి వేరే అతనితో పెళ్ళి చేసుకుని హాయిగా వెళ్లిపోయింది నాకు జీవితం అంతా శూన్యమే మిగిలిచింది . ప్రేమ విఫలం అయితే ఎంత భయంకరంగా ఉంటుందో అంత నేను అనుభవించాను. తన జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి నాకు చాలా సమయం  పట్టింది. చాలా కాలం తరువాత తన జ్ఞాపకాల నుంచి బయటకు రావడం జరిగింది. 

 

ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఆ తరవాత నాతో మాట్లాడాలి అని చాలా ట్రై చేసింది. కానీ ఆమెకు నేను అవకాశం కల్పించలేదు. ఇప్పుడిప్పుడే ఆమె ప్రేమ నుండి బయటకు వస్తున్నా సమయంలో మళ్ళీ ఆమె మాట్లాడితే నేను మళ్ళీ మొదటి బాధను అనుభవించవలసి వస్తుంది.  నా తొలి ప్రేమ నాకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. కానీ నిజమైన ఫ్రెండ్స్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ రోజు హ్యాపీగా ఉద్యోగము చేసుకోగలుగుతూ ఉన్నాను కాబట్టి ఎవరైనా ప్రేమించే ముందు కొంచెం ఆలోచించి.. నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని ఆ ప్రియుడు  చిన్న సలహా

మరింత సమాచారం తెలుసుకోండి: