అధిక బరువు, ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా కామన్ గా వినిపిస్తున్న సమస్యలు. బరువు అధికంగా పెరుగుతున్నాం అని తెలుసుకుంటే చాలు ఎవరైనా దాన్ని తగ్గించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఎవరైనా అధికంగా బరువు ఎందుకు పెరుగుతారు ? వ్యాయామం చేయకపోవడం, అతిగా తినడం అనే రెండు కారణాలను మాత్రమే ఇందుకు సమాధానాలుగా ఎవరైనా చెబుతారు. అయితే అధిక బ‌రువుకు ఈ సులువైన చిట్కాల‌తో చెక్ పెట్టేయండి.

 

- అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌న్నా, కొవ్వును కరిగించుకోవాల‌న్నా పసుపు, నిమ్మరసంను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ రెండింటినీ స‌లాడ్స్‌లో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతుంది.

 

- యాపిల్ మనకు అందుబాటులో ఉన్న సూపర్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. బరువు తగ్గించుకునేందుకు ఈ పండు మనకు ఎంతగానో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లలో డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయం చేస్తాయి.

 

- నారింజ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి.

 

- ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని,  పావు టీస్పూన్ పసుపును మిక్స్ చేయాలి. ఇందులో కావాల‌నుకుంటే అందులో కొద్దిగా తేనె క‌ల‌ప‌వ‌చ్చు. ఈ నీటిని రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సులువుగా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

- జామ పండ్లు మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇవి ధర కూడా అంతగా ఉండవు. కనుక వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీనికి తోడు అధిక బరువు కూడా తగ్గవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: