మీ వెకిల్స్ కి ప్రతీ రోజు లీటర్లు లీటర్లు పెట్రోల్ కొట్టించలేక పోతున్నారా.. రోజు రోజుకు పెరుగుతున్న డీజీల్, పెట్రోల్ ధరలు మీకు చుక్కలు చూపిస్తున్నాయా ఐతే.. మీ వెహిల్ ని కరెంట్ వాహనంగా మార్చుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. హైద్రాబాద్ కుర్రాడు అక్బర్ బేగ్ ని కలిస్తే మీపని అయిపోతుంది. ఒక్క ఐదు రోజులు అతని దగ్గర మీ వాహనాన్ని వదిలితే చాలు మీ వెహికిల్ ని ఎలక్రిక్ వెహిల్ గా మారుస్తాడు. సంవత్సర కాలంలో 30 వెహికిల్స్ ని ఎలక్ర్టికల్ వెహికిల్స్ గా మర్చిన ఘనత ఈ కుర్రాడిది. 'భరత్ భూమి' స్టార్టప్ తో భవిష్యత్తులో మరిన్ని వెహికిల్స్ కి ఎలక్ట్రిక్ హంగులు అద్ది సిటీని పొల్యూషన్ ఫ్రీగా చేస్తానంటున్నాడు అక్బర్ బేగ్. ఈ ఆటోమొబైల్ ఇంజనీర్ పై ప్రత్యేక కథనం. 
 

అక్బర్ బేగ్ కి చిన్నప్పటినుండి కార్లు అంటే మహా ఇష్టం. ప్రతీ రోజు తల్లిదండ్రులను బెంజ్ కారు కొన్నివ్వమంటూ మారాం చేసేవాడు. కాని అక్బర్ కుటుంబం బెంజ్ కారు కొనేంత స్తోమతలేకపోవడంతో తల్లిదండ్రులు ఏదోఒకటి చెప్పి నచ్చచెప్పే వారు. అప్పటికీ అక్బక్ అడిగిన ప్రతీ రిమోట్ కారు తండ్రి కొని ఇచ్చేవాడు. కాని సాయంత్రంలోపు కారును నామరూపాలు లేకుండా చేసి పార్ట్స్ ని విడివిడిగా చేసేవాడట. అసలు కారు ఎలా నడుస్తుందని తెలుకోవలనుకునేవాడు. కాని అర్ధం చేసుకునే వయసు కాకపోవడం వల్ల ఎన్నిసార్లు కార్లు కొన్నా పాడుచేసేవాడు. పెరిగి పెద్దవుతున్నాకొద్దీ ఇర్నెట్ సహాయంతో కార్లు  తయారు చేయడం మొదలు పెట్టాడు. కాని ప్రాక్టికల్ గా అనుభవం లేకపోవడంతో నిరాశే ఎదురయ్యేది. 

 

కార్లు అంటే ఇష్టం ఉండే అక్బర్ తనకు నచ్చిన మెకానికల్ ఇంజనీర్ లో చేరాడు. దీనికి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాలో ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. మొత్తానికి ఆటోమొబైల్స్ పై పట్టు సాదించి సక్సెస్ అయ్యాడు. రెండు నెలల వ్యవథిలో ఫ్రెండ్స్ తో కలిసి ఎలక్ట్రిక్ కారును తయారు చేసాడు. ఈ కారు అక్బర్  కి మంచి గుర్తిపుకూడా తెచ్చిపెట్టింది. జర్మనీలాంటి పెద్ద దేశాల్లో ప్రజంటేషన్ ఇచ్చే అవకాశాన్ని తీసుకువచ్చింది. దీంతో అక్బర్ కి ఉద్యోగ అవకాశాలు కూడా క్యూ కట్టాయి. 

 

కాని అక్బర్ కి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నలుగురిలో ఒకరిగా బ్రతకాలనుకోలేదు. అందుకని తాను బిజినెస్ ప్రారంభించాలనుకున్నాడు. కాని ధైర్యం సరిపోలేదు. ఎలా బిజినేస్ ప్రారంభించాలో అర్దం కాని సమయంలో తన స్నేహితుడు అశార్ అహమ్మద్ శేక్ చేతులు కలిపాడు. దీంతో ఇద్దరు స్నెహితులు కలిసి కార్లను కరెంట్ కార్లుగా మార్చడం మొదులు పెట్టారు. మొత్తానికి సంవత్సర కాలంలో 30 కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చారు.  డీజిల్, పెట్రోల్ తో వచ్చే పొగవల్ల కాలుష్యం పెరుగుతుంది. కాని ఎలక్రిక్ కార్ల వల్ల పొల్యూషన్ ని తగ్గించవచ్చని అక్బర్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: