ఈమద్యకాలంలో ఫేస్ బుక్ లో పరిచయం అయిన వారితో, వాట్స్ యాప్ లో చాటింగ్ చెసిన వారితో ప్రేమలో పడిపోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. మగవారే కాదు.. ఆడవారు కూడా ఇదే తరహాలో ఫేస్ బుక్ లో పరిచయమై పెళ్లి చేసుకుంటనని చెప్పి మోసం చేస్తున్నారు. 

 

తనకు ఫేస్ బుక్ లో పరిచయమై, ప్రేమించానని చెప్పి, ఆపై వివాహం చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుడిని మట్టు బెట్టేందుకు మలేషియా నుంచి వచ్చి, 9 మందికి సుపారీ ఇచ్చిన యువతి కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మలేషియాలో ఉండే అముదేశ్వరి అలియాస్ కవితా అరుణాచలం అనే యువతికి తేని జిల్లాకు చెందిన అశోక్ కుమార్ (24) అనే ప్రైవేటు ఉద్యోగి పరిచయం అయ్యాడు. ఫేస్ బుక్ లో మొదలైన వీరి స్నేహం, ప్రేమగా మారగా పెళ్లి చేసుకోవాలని భావించారు.

 

తరువాత ఎం జరిగిందో తెలయదు కాని.. వారి ఇరువురి మద్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. ఈ క్రమంలో మలేషియా నుంచి పేరు మార్చుకుని అశోక్ కు ఫోన్ చేసిన అముదేశ్వరి, "నువ్వు వివాహం చేసుకోకపోవడం వల్ల ఆమె చనిపోయింది" అని చెప్పింది. దీన్ని నమ్మిన అశోక్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆపై మలేషియా నుంచి వచ్చిన ఆమె, అశోక్ ను కలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై అశోక్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు ఆమెను విచారించారు. ఆమె పలు పేర్లను పెట్టుకుందని, అసలు పేరు విఘ్నేశ్వరి అని గుర్తించారు,. కౌన్సెలింగ్ నిర్వహించి, హెచ్చరించి పంపారు.

 

కోపం తగ్గని అముదేశ్వరి  ప్రియుడిపై పగ పెంచుకని ఎలాగైనా చంపాలనుకుంది. అందుకోసం  ఆమె, 9 మంది కూలీలను కలుపుకుని సుపారీ ఇచ్చి, ప్రియుడిని చంపడానికి ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం వీరందరినీ  మొన్న శుక్రవారం నాడు ఓ ప్రైవేటు లాడ్జీలో ఉంచింది. ఇంత మంది ఒకే రూం లో ఉంటంతో యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇలా అశోక్ కుమార్ ని చంపడానికి విఘ్నోశ్వరీ ప్లాన్ వేసిందని అందుకోసమే ఈ లాడ్జ్ లో బస చేసినట్లు తెలిపారు. వారిదగ్గర నుండి సెల్ ఫోన్లు , కారు, కత్తీ తీసుకున్నారు. విఘ్నేశ్వరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: