సాధార‌ణంగా చాలామంది ఇరవై నాలుగు గంటలూ ఏసీలోనే గడిపి, ఉపశమనాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంటిలోనే కాదు.. ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ హబ్‌లలో ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే సహజమై సిద్ధమైన‌ వాతావరణంలో శరీరం భరించదగ్గ ఉష్ణోగ్రతలో జీవించడం జీవరాసులన్నింటికీ ప్రకృతి పరమైన రక్షణ కల్పిస్తుంది. కానీ ప్రకృతి విరుద్ధమైన పద్ధతుల్లో కృత్రిమ చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

 

ఏసీ ఆన్ చేయగానే తలుపులు మూసేస్తాం. అందువల్ల మనం విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్లీ మనమే పీలుస్తుంటాం. దీంతో ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఎక్కువ సమయం ఎయిర్‌ కండీషన్డ్‌ వాతావరణానికి అలవాటు పడడం వల్ల... శరీరం కేవలం ఒక స్థాయి వాతావరణానికే సహకరించే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికీ గురై, గుండెపై, శ్వాసకోశంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఏసీలో ఎక్కువగా ఉండేవారు అధికంగా నీళ్లు తాగకపోతే వాళ్లకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

 

పొడి చర్మం ఉన్న వారు ఏసీలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మంపై తేమ తగ్గుతుంది. చర్మం పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. ఏసీ వల్ల లోబీపీ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి శరీరం త్వరగా అలసిపోతుంది. ఏసీలో ఎంత కూలింగ్ పెరిగితే శరీరానికి అంత ప్రమాదం.  నీరసం, నిస్సత్తువ, ఏదో పోగొట్టుకున్నవారిలా తయారవుతాం. ఇలాంటి అనారోగ్య సమస్యలన్నింటికీ కారణం ఈ కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చే ఏసీలే. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: