ఒక యుక్త వయసు గల మగపులి పేరు 'టీబ్ల్యూఎల్‌ఎస్‌-టీ1-సీ1'.. అది 150 రోజులలో ఆడపులి కోసం ఏకంగా 1300 కిలోమీటర్లు ప్రయాణించింది. నిజానికి...మగ పులులు ఎప్పుడూ ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి సంచరిస్తూ.. తమ సంస్థానములు పెంచుకుంటూ పోతాయి. ఇదే క్రమంలో అవి ఆడతోడుని కూడా వెతుకుంటాయి. అయితే 2016 సీ1 మగ పులి
...యావత్మాల్‌ జిల్లాలోని తిపేశ్వర్‌ పులుల అభయారణ్యంలో(మహారాష్ట్ర) టీబ్ల్యూఎల్‌ఎస్‌-టీ1 అనే ఆడపులికి పుట్టింది. ఇక్కడ c1 అంటే చైల్డ్ నెంబర్ 1 అని అర్ధం. టీ అంటే టైగర్ అని అర్ధం.

 

 

మహారాష్ట్ర అటవీ అధికారులు సీ1 టైగర్ మెడలో రేడియో కాలర్ పరికరాన్ని అమర్చి.. దాని అడుగడుగును ట్రాక్ చేస్తుంటారు. ఈ విధంగా ట్రాక్ చేసిన అధికారులకు... సీ1 టైగర్ ఎక్కడ ఎక్కడ తిరిగిందో మొత్తం తెలిసింది. అయితే ఆ వివరాలను తాజాగా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. వారు చెప్పిన ప్రకారం... ఈ ఏడాది జూన్ 19వ తారీఖున c1 మగపులి తిపేశ్వర్‌ అభయారణ్యాన్ని విడిచి.. అంబడి ఘాట్, కిన్వాత్‌ అరణ్య ప్రాంతాల ద్వారా తెలంగాణలోని అదిలాబాద్‌ పట్టణంకు చేరింది. అయితే ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకూ అదిలాబాద్‌, నాందేడ్‌ డివిజన్లలోని అంతర్రాష్ట్ర అడవుల్లో చాలా రోజులు గడిపింది. ఆపై పైంగంగా అభయారణ్యం లో అడుగుపెట్టి కొంత సమయం గడిపింది. అలా ఆడ పులి కోసం తిరుగుతూ చాలా జిల్లాల్లో 150 రోజుల పాటు గడుపుతూ పదమూడు వందల కిలోమీటర్లు తిరిగిందని అటవీ అధికారులు తెలిపారు. చివరకు మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యాన్ని చేరిందన్నారు.

అయితే 150 రోజుల్లో ఎన్నో జిల్లాల్లో తిరిగినా..
...ఒక్క సందర్భంలో కూడా.. ఏ మనిషిపై దాడి చేయలేదని.. కాకపోతే ఇది బతకడం కోసం కొన్ని పశువుల మీద దాడి చేసి తన ఆకలి తీర్చుకుందని అటవీ అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: