పిల్లల్ని చిన్న వయసు నుండే క్రమశిక్షణతో పెంచాల్సి ఉంటుంది. పిల్లలను గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ అది శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల పెద్దలు చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరిపోతులుగా మారుస్తున్నాం.

 

ఈ తరం పిల్లలు కనీసం వారి పని కూడా వారు చేసుకోలేరు.. అమ్మ అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారు తప్ప వెతుక్కోరు.. వొళ్ళు కదలనివ్వరు.. ఒక్క పని చెయ్యరు.. సోమరిపోతులు అవుతారు దీనికి కారణం ఎవరు మనమే.. గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.. వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.. కష్టం గురించి తెలిసేలా పెంచండి అని.. కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..

 

ప్రేమ, గారాబంతో మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. అభినయాలు కనపడం లేదు, అణుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.. ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

 

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే.. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..? ఒక్క సారి ఆలోచన చేయండి... సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో మసీదుకు వెళ్ళో పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు.

 

పిల్లలకు.. బాధ్యత, బరువు, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవం, దేశం, ఇవి సంప్రదాయాలు అంటే.. కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక పిల్లలకు అలవాటు చేయాలి.. ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారవుతారు. ఈ విషయాలను అన్ని ఓ నెటిజన్ ఆవేదనతో రాసి సోషల మీడియాలో పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: