నేటి బాలలే రేపటి పౌరులు, తల్లితండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని చిన్నారుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచే చిన్నారులతో సఖ్యతగా వుంటూ వాళ్ల అభిరుచులు తెలుసుకోవడం ఉత్తమం. ఇక చిన్నారుల చెంతకు టీవీ, సినిమా అనే పెనుభూతాన్ని దరి చేరనివ్వకండి. 

 

ఈరోజుల్లో సినిమాలు కుటుంబ సభ్యులు అందరూ ఒక్క చోట కూర్చుని చూసేలా లేవు అనే మాట వాస్తవం. వినోదం అనే మాయలో పడి చిన్నారులు టీవీ లేదా సినిమాకు అలవాటు పడితే ఇక అంతే సంగతులు. ఒక 9 వ తరగతి చదివే అబ్బాయి తన తోటి క్లాస్ అమ్మాయి తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నా ఘటనను మనం చూసాం. ఇలాంటి ఘటనలు జరగడానికి బూతు డైలాగ్స్ తో ఉన్న సినిమాలు మరియు వినోద కార్యక్రమాల జోలికి వెళ్లనివ్వకపోవడం ఉత్తమం. 

 

చిన్నారుల జీవితాల్ని కబళించేస్తున్న మహమ్మారి

 

13 సంవత్సరాలనుండి 19 సంవత్సరాల వరకు మీ చిన్నారులు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండడం మంచిది. ఇంట్లో కూడా టీవీ ని ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాలు మరియు సినిమాలకు మాత్రమే అలవాటు చెయ్యడం మంచిది. "స్మార్ట్ ఫోన్" అనే మహమ్మారి పిల్లల శారీరక, మానసిక జీవితాన్ని నాశనం చేస్తోందని శాస్త్రవేత్తలు మూకుమ్మడిగా వాపోతున్నారు. 

 

ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి జీవనం అసాధ్యం అనేలా ఉంది, కానీ చిన్న వయసు నుంచే పిల్లలకి స్మార్ట్ ఫోన్ అలవాటు చెయ్యడం ద్వారా మీరే మీ చిన్నారుల జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక పిల్లోడు తన అమ్మమ్మ నాన్న అమ్మని ఇబ్బంది పెడుతోందంటూ పోలీసులకు ఫోన్ చేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ దగ్గరకు మీ పిల్లల్ని వెళ్లనివ్వకపోవడం ఉత్తమం. రేపటి భావి భారత పౌరులను తీర్చి దిద్దేవారిగా తల్లితండ్రులపై భాద్యత ఉన్న నేపథ్యంలో మీ చిన్నారులను స్మార్ట్ ఫోన్ మహమ్మారి నుంచి దూరంగా ఉంచండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: