ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి ప్రవర్తనతో పెంచాలని భావిస్తుంటారు. కానీ తమ పిల్లల మీద ప్రేమతోటి... వారు ఎన్ని తప్పులు చేసినా... ఎన్ని చెడు అలవాట్లను నేర్చుకున్నా... ఎంత అమర్యాదగా మాట్లాడినా... గట్టిగ మందలించకుండా, మంచి చెప్పకుండా వదిలేస్తుంటారు. కానీ అలా చేయడం వలన... మీ పిల్లలని మీరే చైజేతుల నాశనం చేసుకున్నట్లు అవుతుంది. అంతే మీ పిల్లలకు టీవీ, స్మార్ట్ ఫోన్, సినిమాలు, బయట ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు చేయకండి. చిన్నతనంలోనే... విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడాలు, బైకులు కొన్నివ్వడాలు చేయకండి. బాగా కఠినంగా ఉంటూ... ఒక ప్రిన్సిపాల్ లాగా వాళ్ళని అసలు పెంచకండి. వాళ్లకి చాలా గౌరవం, ప్రాముఖ్యతను ఇవ్వండి... ఇంకా... సున్నితంగా వాళ్లకి మంచి ఎదో... చెడు ఎదో చెప్తూ... మంచి నడవడికని నేర్పించండి.

చిన్నతనంలోనే మొబైల్ ఫోన్ కొనివ్వడం వలన... వారు దానికి బానిస అయిపోతారు. ఆ తర్వాత... వారి డెవలప్ అయ్యే మైండ్ కాస్త మందగిస్తుంది. అందుకే టెక్నాలజీకి దూరంగా ఉంచి.. వారు పుట్టిన దగ్గరనుంచి... మంచి పుస్తకాలను చదివి వినిపించండి. అలా చేయడం వలన వారికి జ్ఞానంతో పాటు... చదువు మీద శ్రద్ధ వస్తుంది. చిన్నతనంలో వాళ్ళకు... జ్ఞాపక శక్తి, మేధా శక్తి బాగా ఉంటుంది కాబట్టి... ఒక కొత్త భాష(ఏదైనా ఒక కళను) నేర్పించండి. వాళ్ళు నేర్చుకుంటున్న సమయంలో... వాళ్లు కొంచెం ప్రతిభను చూపిన ఎంతో పాజిటివ్ గా పొగడండి. ఎటువంటి విషయంలోనైనా... వారిని అస్సలు నిరుత్సాహ పరచకండి. చదువులో వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే... వాళ్లని తిట్టకండి, నిందించకండి. వాళ్లకు కొండంత నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా... చదువు విషయంలో... మీకు సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయండి.

ఒక మంచి మెడిటేషన్ సెంటర్ లో వాళ్ళని జాయిన్ చేసి చిన్నప్పటి నుంచే ధ్యానం మీద శ్రద్ధని కల్పించండి. మహానుభావుల జీవిత చరిత్రను వారికి వినిపించండి... స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర పుస్తకాలు వారికి కొనివ్వండి. మంచి పుస్తకాలను మీ పిల్లల చదవడం వలన... అవి వారి మీద మంచి ప్రభావం చూపి... వారి ఆలోచన వైఖరిని చక్కగా మారుస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ వ్యక్తిత్వం. మంచి వ్యకిత్వ నిర్మాణానికే వాళ్లకు ఆధ్యాత్మికత గురువులు చెప్పిన మాటలను పదే పదే చెప్పండి. తరుచుగా బయటకి తీసుకెళ్లండి... ఆహ్లాదకరమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆటలు ఆడించండి. శాకాహార ఆహారం ఎక్కువగా తినిపించండి. ప్రతిరోజు వారితో తాజా పండ్లును తినిపించండి. బూస్ట్, హార్లిక్స్, పంచదార, స్వీట్లు వంటివి అస్సలు పెట్టకండి. చివరిగా... ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాల కార్ఖానా అంటారు.. అందుకే... వారు చెడిపోకుండా ఉండేందుకు... ఎప్పుడూ ఏదో ఒక మంచి పనిని చేసేలా చేయండి.




మరింత సమాచారం తెలుసుకోండి: