సాధార‌ణంగా టీవీ చూసేటప్పుడు, కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు, దాదాపు అందరూ కూర్చునే ఉంటారు. రోజాంత ఉద్యోగంలో గంటల తరబడి ఒకేచోట కూర్చునే పని చేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స‌హ‌జంగా బస్సుల్లో, రైళ్ళల్లో సీటులు లేక చాలాసేపు నిల్చునే ప్రయాణిస్తే నడుం నొప్పి వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు నడుము చుట్టు వచ్చి చేరుతుంది. 

 

ఫలితంగా స్థూలకాయం, రక్తంలో చెక్కర స్ధాయిలు ఎక్కువవడం, రక్తపోటు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇప్పుడు సంభవించ అత్యధిక మరణాలు గుండె వ్యాధుల వల్లే ఉంటున్నాయి.  ముఖ్యంగా ఫిట్ నెస్ గా ఉండాలని అనుకునేవారు ఈ అలవాటుని మానుకోవాలట. ఎప్పుడూ కుర్చీకి అతుక్కుని కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని రావాలి. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల డయాబటెస్ సమస్య ఎదురవుతుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం వ‌ల్ల కూడా డిప్రెష‌న్‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ట‌. 

 

ఎందుకంటే రోజుకి ఏడు గంటలు, అంతకన్నా ఎక్కువ సేపు కూర్చునే స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు మరింత అధికంగా కనిపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పరిసర వాతావారణంతో సంబంధం తగ్గిపోతుందని, ఇది డిప్రెషన్ కు దారి తిస్తుందని పరిశోధకులు అంటున్నారు. మ‌రియు రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: