దొంగతనం అంటే మాటల అండి.. ముందుగా దానికి పక్కా ప్లాన్ తో స్కెచ్ గీసుకోవాలి.. ఎందుకంటే ఒక సామెత ఉంది గుర్తుందా "దొరికితే దొంగ, దొరకకపోతే దొర "


వివరాలలోకి వెళితే ఒక దొంగ రాత్రంతా ఎంతో కష్టపడి ఒక కిటికీ పగలకొట్టి మరి ఇంటికి కన్నం వేసాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే షాక్ అయ్యాడు. అసలు ఆ ఇంట్లో దోచుకోడానికి విలువయిన సామాన్లు, డబ్బు, నగలు అసలు ఏమి వస్తువులే లేవంట.
విస్తిపోయిన దొంగ ఏమిచేయాలో తెలియక కోపంతో ఇంటి యజమానికి ఒక లేఖరాసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడట. లేఖను చూస్తే అసలు నవ్వు ఆపుకోలేరట.


ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ప్రభుత్వ సంస్థలో ఇంజీనీర్ గా పనిచేస్తున్న పర్వేశ్ సోనీ ఇంట్లోలేని సమయములో రాత్రి పూట కిటికీ పగలకొట్టుకుని ఒక దొంగ లోపలికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చాక ఒక్క విలువైన వస్తువు కూడా లేకపోవడం తో యజమానికి కోపంతో ఒక లేఖ రాసాడు. "నువ్వు చాలా పిసినారివాడివి రా... కనీసం శ్రమకి తగిన ఫలితం కూడా దక్కలేదు.. ఈ రాత్రంతా వృధా అయింది"కనీసం కిటికీ పీకినందుకు అయినా తగిన ఫలితం దక్కలేదు. అని హిందీ లో రాసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

 

తెల్లారక పనిమనిషి వచ్చి చూసేసరికి ఇల్లు అంతా చిందరవందర గా ఉంది. టేబుల్ మీద లెటర్ చూసి పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు లెటర్ ని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ కి పంపారు. పర్వేశ్ ఇల్లు జాయింట్ కలెక్టర్, న్యాయమూర్తి ఇంటికి దగ్గరలో ఉండడంతో కేసుని సీరియస్ గా తీసుకుని, సీసీ టీవీ ఫ్యూటెజ్ కూడా పరిశీలిస్తున్నారు. దొంగోడు ఎంత విసిగి పోతే ఈ లెటర్ రాస్తాడు.... 

మరింత సమాచారం తెలుసుకోండి: