వెటర్నరీ డాక్టర్ దిశని అత్యంత క్రూరంగా సజీవ దహనం చేసిన నిందితులను... పోలీసులు ఈరోజు పొద్దున్న వాళ్లు పారిపోయే యత్నం చేసి దాడి చేయడంతో... 5.45-6.15 మధ్య ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. అయితే ఈ కిరాతకులు చనిపోయిన ఈ రోజుని పండుగ కంటే ఎక్కువగా యావత్ భారతదేశం సెలెబ్రేట్ చేసుకుంటుంది. దిశని ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యురాలిగా భావించి ఆమెకు న్యాయం జరగాలని గత పది రోజులుగా కోరుకున్నారు, నిరసనలు చేసారు. అయితే ప్రజలు ఆశించిన రీతిలోనే సత్వర న్యాయం జరగడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తన హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడకు చెందిన ఒక హోటల్ యజమాని మాత్రం తన సంతోషాన్ని ముచ్చట వేసే తీరులో వ్యక్తం చేస్తున్నాడు. అది.. పైన ఫోటో లో ఉన్నది చదివితే మీకే అర్ధం అవుతుంది.



‘దిశ హత్యకు కారకులైన నలుగురిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను అభినందిస్తూ... ఈ రోజు ఇక్కడకు వచ్చి కాఫీ, బూస్ట్, పాలు తాగే వారికి ఉచితంగా ఇస్తాం. ఈ రోజు మాత్రమే.’ అని ఒక హోటల్ యజమాని తెల్ల పేపర్ పై ప్రింటు చేయించి తన హోటల్ కు అతికించాడు. దీంతో ప్రజలు ఈ ఎన్కౌంటర్ ను ఎంత సంతోషంగా స్వీకరిస్తున్నారో తెలుస్తుంది.


కాగా, పోలీసుల్లో హీరో అయిన సీపీ వీసీ సజ్జనార్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. సజ్జనార్ బంధువులు అందరూ అతని ఇంటికి వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. కర్నాటక రాష్ట్రం గదగ్‌ జిల్లాలో సజ్జనార్‌ జన్మించిన అసుతి గ్రామంలో కూడా మగవారు, మహిళలు మిఠాయిలు పంచుకుంటున్నారు. సజ్జనార్ 1996 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అయితే అతను డ్యూటీ లో జాయిన్ అయ్యిన రోజు నుంచి ఎంతో అంకితభావంతో తన విధులను నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు ఖచ్చిత న్యాయం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: