చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి, సీతాఫలాన్ని రకరకాలుగా పిలుస్తారు. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అందరికీ చాలా మంచిది.  అయితే చలికాలంలో ఎక్కువగా సీతాఫలాలు వస్తుంటాయి. దీంట్లో విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే సీతాఫ‌ల‌మే కాదు దీని ఆకులు, బెరడు, వేరు… ఇలా అన్ని భాగాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

 

గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం గర్భస్రావాన్ని నివారిస్తుంది. ఈ పండులోని గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. ఈ కారణంగా జీర్ణక్రియం వేగవంతం అవుతుంది. ఎలాంటి జీర్ణ సమస్యలు దరిచేరవు.   ఈ పండ్లలోని విటమిన్ A... మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది.

 

శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తింటే వెంట‌నే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.  ఎదుగుతున్న పిల్లలు నిత్యం సీతాఫ‌లాన్ని తింటుంటే దాంతో కాల్షియం వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. సీతా ఫలంలో నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న సీతాఫలానికి డయాబెటిక్ పేషెంట్స్ కాస్తా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో చక్కెరశాతం అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం మధుమేహులకు అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: