సాధార‌ణంగా స్మోకింగ్ ఫ్యాషన్ అని ఒకరంటే..ఒత్తిడిని దూరం చేసే ఆయుధం అని మరొకరంటారు. నోట్లో సిగరెట్ పెట్టుకుని.. గుప్పులు గుప్పులుగా పొగ వదలడాన్ని ట్రెండ్ అంటారు, స్టైల్ అంటారు.  అంతకంటే అది ప్రాణాన్ని తీసే యమపాశం అనే సంగతి మాత్రం చాలామందికి తెలిసినా మర్చిపోయి ఊదేస్తుంటారు. రోడ్డు మీదకు వచ్చి చూస్తే.. నూటికి తొంభై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో, బీడీనో, లేక ఏదో ఒక పొగాకు ఉత్పత్తి కనిపిస్తుంది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు.. అనే అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇది శరీరాన్ని, మనసును మాత్రమే కాకుండా, మీ అందానికి కూడా ఊహకు అందని నష్టాన్ని కలుగజేస్తుంది.

 

అలాగే మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. దంప‌తుల్లో ఆడ‌, మ‌గ ఎవ‌రైనా పొగ తాగితే దాంతో పిల్లలు పుట్టే అవ‌కాశం తగ్గుతుంద‌ని, ఒక వేళ పుట్టినా ఆ పిల్ల‌ల‌కు అనేక ర‌కాల అనారోగ్యాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. పొగ‌తాగే మ‌గ‌వారిలో వీర్య క‌ణాలు పూర్తిగా నాశ‌న‌మ‌వుతాయ‌ట‌. ఒక వేళ ఎంతో కొంత మొత్తంలో ఉన్నా వాటి వ‌ల్ల పిల్ల‌లు పుట్టేందుకు అవకాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. మ‌రియు పొగ‌తాగని ఆడ‌వారితో పోలిస్తే పొగ తాగే వారిలో అండం స‌రిగ్గా వృద్ధి చెంద‌ద‌ట‌. 

 

దీనికి తోడు రుతుక్ర‌మంలో మార్పులు ఏర్ప‌డి వారు సంతానం పొందే అవ‌కాశాల‌ను ఇంకా క‌ఠిన‌త‌రం చేసుకుంటార‌ట‌. ఈ క్ర‌మంలో సంతానం పొందాల‌నుకునే దంప‌తులు పొగ తాగ‌డం మానేయాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. వాస్త‌వానికి ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి దాని నుండి బయటకు రావడం కష్టంగానే ఉంటుంది. అయితే ధూమపానం విడిచిపెట్టటం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. మీరు ఏ వయస్సులో అయినా సరే, స్మోకింగ్‌ను విడిచిపెట్టాలనుకుంటే, అది మీ జీవితరేఖను పెంచుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: