సాధారణంగా చిన్న పిల్లలు తరచూ ఏడుస్తుంటారు. పసి పిల్లలు మాట్లాడ‌లేరు కాబ‌ట్టిఏడ‌వ‌డం స‌హ‌జం. పసి పిల్లలకు భాష చాల చిన్నది.  సంతోషమైతే నవ్వు, బాధ ఇబ్బంది అయితే ఏడుపు ఇదే వారి భాష. ఒక్కోసారి పసిపిల్లలు ఎందుకు ఏడుస్తారో, కారణం ఏంటో ఎవరికీ తెలియదు. వాస్త‌వానికి ఆకలి మొదలు అనారోగ్యం వరకు పిల్లలు ఏడవటం సహజమే. అయితే పిల్లల పెంపకం మీద అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లలు పట్టుమని ప‌ది నిమిషాలు ఏడవగానే.. ఆసుపత్రికి పరుగులు పెడుతుంటారు. ఇక మ‌రికొంద‌రు  హైరానా పడుతూ ఏం చేయాలో తోచకా చిన్నారుల ఏడ్పు ఆప‌డానికి అనేక ర‌కాలుగా ట్రై చేస్తుంటారు.

 

దీంతో వారిని ఎత్తుకోవ‌డం, లాలించ‌డం, బుజ్జగించ‌డం చేస్తారు.  అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల కొంద‌రైతే ఏడుపు మానేస్తారు, కానీ కొంద‌రు మాత్రం ఎంత సేపైనా అలా ఏడుస్తూనే ఉంటారు. అలాంటి స‌మ‌యంలో కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఈజీగా వాళ్లు ఏడ్పును ఆప‌వ‌చ్చు. కొంద‌రు పిల్ల‌ల‌కు ఛాతీ, క‌డుపు మ‌ధ్య భాగానికి నొప్పి వ‌స్తుంటుంది. దీన్నే సోలార్ ప్లెక్స‌స్ అని పిలుస్తారు. అయితే దీన్ని త‌గ్గించాలంటే కాలి వేళ్ల పై భాగాల్లో మ‌ర్ద‌నా చేస్తే ఏడ్పును అపేస్తారు. మ‌రియు కాలి మ‌డ‌మల‌పై మ‌ర్ద‌నా చేస్తే కండ‌రాల స‌మ‌స్య‌లు పోతాయి. అంతేకాకుండా చ‌క్క‌ని శ‌రీర ఆకృతి వ‌స్తుంది.

 

అదే విధంగా.. పిల్ల‌లు ఆప‌కుండా ఏడుస్తుంటే రెండు పాదాల‌కు కింది వైపు మ‌ధ్య‌భాగంలో మ‌ర్ద‌నా చేస్తే పిల్ల‌లు ఇట్టే ఏడుపును ఆపేస్తారు. మిర‌యు చిన్నారులు సైన‌స్ వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటే కాలి బొట‌న వేళ్ల మ‌ధ్య‌లో సున్నితంగా కొంత సేపు మ‌ర్ద‌నా చేయాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి చిన్నారుల‌కు ఉప‌శ‌మనం క‌లుగుతుంది. ఇలా శ‌రీరంలోని కొన్ని నిర్దిష్ట‌మైన ప్రాంతాల్లో కొంత సేపు ఒత్తిడిని క‌ల‌గ‌జేస్తూ అక్క‌డ సున్నితంగా మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించి ఏడ్పును అపుతారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: