చరిత్ర తెలుసుకుంటున్న కొద్ది ఎన్నో వింతలను మన ముందుకు తీసుకువస్తుంది. కానీ చరిత్ర గురించి తెలియాలంటే అప్పటివాళ్ళు ఉండాలి లేదా అప్పటి అప్పటి వారు ఉపయోగించిన వస్తువులు అయిన ఉండాలి. ఇక్కడ వింత ఏమిటంటే అప్పటి వారు వాడిన వస్తువుల ఆధారంగా చేసుకొని అప్పటి మనుషుల డిఎన్ఏ ని కనుక్కోగలమని అంటున్నారు శాస్త్రవేత్తలు.  అంతేకాదు వారి అలవాట్లు చెప్పడంతో పటు వారి ఊహా చిత్రాన్ని కూడా గీయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు..ఏంటి స్టోరీ అర్థం కావడం లేదా..అయితే అసలు విషయం మీకు తప్పకుండా తెలియాల్సిందే..వివరాలలోకి వెళ్తే..

 

డెన్మార్క్ లోని లోలాండ్ ద్వీపంలో ఉన్న ఒక ప్రదేశం లో శాస్త్రవేత్తలు వారి పరిశోధనల కోసం తవ్వకాలు జరుపుతుండగా  రెండు సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ చూయింగ్  గమ్ వంటి పదార్ధం దొరికింది. దానిపై కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అది కొండరావి చెట్టు బెరడు నుంచి తయారు చేసిన పదర్దంగా గుర్తించారు. అంతేకాదు దీనిలో మావవుడి డీఎన్ఎ కూడా ఉందని గుర్తించారు.

 

అక్కడితో వారి పరిశోధనలు ఆగలేదు. అసలు ఆ మానవుడు ఎవరు, ఏ జాతికి చెందిన వాళ్ళు అంటూ పరిశోధనలు చేయగా విస్తు గొలిపే నిజాలు బయటపడ్డాయి. సుమారు ఆరువేల సంవస్త్సరాల క్రితం ఓ అమ్మాయి వాడిని చూయింగ్  గమ్ గా గుర్తించారు. అంతేకాదు అప్పట్లో ఆమెపై ఉన్న క్రిములు, ఆమె ఆ సమయంలో ఎలాంటి వ్యాధితో బాధపడింది అనే విషయాలు కూడా వెల్లడించారు. ఆమె పడేసిన చూయింగ్ గమ్ లో బాదం పప్పుతో పాటు బాతు మాంసం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఆమె ఊహా చిత్రాన్ని టామ్ జోక్లాండ్ తో గీయించారు. ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: