భారతదేశంలో అనియంత్రిత పర్యావరణ క్షీణత మరియు వాతావరణ మార్పుల యొక్క ప్రమాదాలను చూపే  ఇండియా 2050 అనే డాక్యుమెంటరీ షో త్వరలో టీవీ స్క్రీన్ ల పైకి  రానుంది.  భవిష్యత్తు ను  మన కళ్ళ ముందు చూపించే  ఈ ప్రదర్శన డిసెంబర్ 29 న డిస్కవరీ ఛానెల్‌లో ప్రదర్శించబడుతుంది.  ఈ కార్యక్రమం 2050  మొదట  జైపూర్‌ నగరం తో ప్రారంభమవుతుంది. జైపూర్  నగరం పూర్తిగా ఇసుక  తెమ్మల కింద ఖననం చేయబడిందని ఊహాజనితంగా  చూపిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 జైపూర్  తరువాత ఢిల్లీ , చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి నగరాల వైపుకి ఈ కార్యక్రమం  వెళుతుంది. వాతావరణ మార్పుల గురించి ఏదైనా చేయకపోతే, రాబోయే కాలం లో  మానవాళి ఎదుర్కొనే సమస్యల   గురించి   ప్రేక్షకులకు ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది ఈ కార్యక్రమం.  ఇండియా  2050  కార్యక్రమం మనం మారకపోతే ఏమి జరుగుతుందో, పరిస్థితులు ఎలా వుంటాయో మరియు రాబోయే కాలం లో మనం ఎదుర్కొనే అనర్థలను  ఊహాజనితంగా చూపెడుతుంది. ఇది మన అందరికి ఒక మేల్కొలుపు కాల్, చాలా ఆలస్యం కావడానికి ముందే మన సమిష్టి నిద్ర నుండి బయటపడాలని మనలో ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను  అని డిస్కవరీ దక్షిణ ఆసియాలోని డైరెక్టర్-కంటెంట్, ఫ్యాక్చువల్ అండ్ లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ సాయి అభిషేక్ అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

ప్రదర్శనలో పర్యావరణ వ్యవస్థకు పారిశ్రామిక నష్టాన్ని ఎత్తిచూపి, రచయిత అమితావ్ ఘోష్ ఇలా అన్నారు. పర్యావరణ వ్యవస్థకు  పారిశ్రామిక సంస్థలు చాల కాలం నుండి నష్టాన్ని కలిగిస్తున్నాయి.  మేము ఏ విధంగానూ పారిశ్రామిక ప్రక్రియ ను ఆపలేము.  ఎందుకంటే భారీ క్రమబద్ధమైన,  నిధులతో కూడిన వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థ. ఈ వ్యవస్థ చాల కాలం నుండి పర్యావరణానికి అఘాతం కలిగిస్తుంది. పారిశ్రామిక వ్యవస్థ వలన కలిగే అనర్దాలను తగ్గించడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు అని అయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం  పర్యావరణ వలస మరియు వాతావరణ శరణార్థుల సంక్షోభాన్ని కూడా హైలైట్ చేస్తుంది. 2019 ఆగస్టు నెలలో, 12 రోజుల్లో, భారతదేశానికి వెయ్యికి పైగా తీవ్రమైన మరియు భారీ వర్షపాతం సంఘటనలు వచ్చాయి.   వాతావరణ మార్పుల యొక్క చెడు  ప్రభావాలను చూడండి, అవి ఇప్పుడు సంభవిస్తున్నాయి  అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: