ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ కి చెందిన ఓ చిత్ర దర్శకుడి పై ఓ పత్రికా సంస్థ సీఈవో రేప్ చేశాడంటూ భాదిత దర్శకుడు ప్రకటించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు జంషెద్ మహమద్. ఈ దర్శకుడు కొన్ని నెలల క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఈ సంచలన ఆరోపణ చేశాడు. కానీ అప్పట్లో పేరుని వెల్లడించలేదు. ఇప్పుడు భాదిత దర్శకుడు మళ్ళీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

 

నన్ను రేప్ చేసింది ఎవరో కాదు అంటూ ప్రముఖ డాన్ పత్రిక సిఈవో అయిన హమీద్ హరూన్ పేరుని వెల్లడించాడు. దాంతో ఇప్పడు ఈ ట్వీట్ పై పెద్ద దుమారం రేగుతోంది. ఆయన నన్ను 13 ఏళ్ళ క్రితం హత్యాచారం చేశాడు. మీరు ఈ వార్తని మీ పత్రికలో వేయగాలరా అంటూ డాన్ పత్రికకి సవాల్ విసిరాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వార్తని మీ పత్రికలో వేయండి అంటూ ట్వీట్ చేశాడు.

 

నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. ఈ విషయం మొదటిగా నా స్నేహితులకి చెప్పా వారు నన్ను చూసి నవ్వారు, కానీ ఈ ఘటన తాలూకు గుర్తులు ఇప్పటికి నన్ను వెంటాడుతున్నాయి అంటూ గతాన్ని తలుచుకుంటూ ట్వీట్ చేశాడు. అతడు నా తండ్రి చనిపోయినప్పుడు వచ్చాడు. కానీ నా పై అతడు చేసిన అఘాయిత్యం నా తండ్రికి కూడా తెలుసన్న విషయం అతడికి తెలియదని తెలిపాడు  

 

మరింత సమాచారం తెలుసుకోండి: