భారత దేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో వినూత్నంగా ముందుకు సాగుతూ విప్లవాత్మకమైన మార్పుల దిశగా భారత దేశం దూసుకుపోతోంది. నరేంద్రమోడి వచ్చిన తరువాత ఎన్నో సంస్కరణలు అమలు చేస్తూ , మరెన్నో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. చెదలు పట్టిన పాతకాలపు విధానాలకి స్వస్తి పలికి, యువతరాన్ని భారతదేశ ఆర్ధిక ప్రగతిలో భాగం చేసేదిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. మోడీ నాయకత్వంలో ఈ దేశం ఆధునిక పంధాలో ముందుకు వెళ్తోందని చెప్పడంలో సందేహంలేదు..

Image result for developed country india

ఒకరు సంపాదిస్తే నలుగురు కూర్చుని తినే పరిస్థితి నుంచీ నలుగురు సంపాదించి ఆర్దికంగా బలంగా మారుతున్నారు. ఈ పురోగాభివ్రుద్ది కోసం దేశ  ప్రజలు కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. తమ ఆర్ధిక ఎదుగుదలకి అవసరమైన వనరులని, ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పధకాలని  వినియోగించుకుంటూ ఆర్ధిక స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నారు. ఈరోజు భారతదేశం ఏ రంగంలోనైనా సరే ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి చేరుకుందంటే అది ప్రభుత్వం ప్రజల సమిష్టికృషే.

Image result for sriharikota

టెక్నాలజీని ఉపయోగించడంలో, క్షిపణుల ప్రయోగాలలో, ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలకి మెరుగైన వ్యవసాయ ఫలితాలు సాధించేలా చేయడంలో సత్పలితాలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే భారతదేశ ఎదుగుదల చూసి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా భారత్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. విదేశాలకి తరలిపోతున్న మన భారతజాతి ఆణిముత్యాలు లాంటి నిపుణులని భారత్ గనుకా మరింతగా వినియోగించుకుంటే భారతదేశం కొద్ది కాలంలోనే మరింతగా అభివృద్ధి చెండుతుందనడంలో సందేహం లేదు....

మరింత సమాచారం తెలుసుకోండి: