హత్య జరిగి కొన్నేళ్ళయ్యింది. ఎంతో కాలంగా హత్య చేసిన హంతకుడి కోసం వెతుకుతున్నారు పోలీసులు. అయినా అతడి ఆచూకి మాత్రం కనిపెట్టలేక పోయాడు. కానీ అనూహ్యమైన పరిణామాల నేపధ్యంలో హంతకుడు ఎట్టకేలకి దొరికాడు. ఏదో సామెత చెప్పినట్టుగా వెతకబోయిన తీగ కాలికి తగిలిందని హత్య మిస్టరీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులకి ఓ తలపగల గొట్టిన చిన్న కర్రముక్క ఆ పాత హంతకుడిని పట్టించింది. వివరాలలోకి వెళ్తే...

 

యూఏఈ లో ఆసియాకి చెందిన ఒక వ్యక్తిపై అదే మరో వ్యక్తి కర్రతో దాడి చేశాడు. దాంతో అతడు పోలీసులని ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అక్కడ వారికి అతడిని కొట్టిన ఒక కట్టే ముక్క కనపడింది. దాంతో ఆ కర్ర ముక్కని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన పోలీసులు ఆ కట్టేని పరిశోదించగా దానిపై దాడి చేసిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ లు కనిపించాయి అవి చూసిన పోలీసులు ఒక్క సారిగా షాక్ అయ్యారు...

 

దాంతో మరోసారి పరీక్షగా ఆ వేలి ముద్రలు పరీక్షించి చూడగా అవి కొన్నేళ్ళ నుంచీ హత్య కేసుకోసం వెతుకున్న హంతకుడు వేలి ముద్రాలకి సరిపోయాయి. దాంతో అప్పటి హత్యని చేసింది కూడా ఇతడేనని, ఆ సమయంలో అతడు వాడింది కూడా ఈ కర్రముక్కనే నని నిర్ధారించుకుని తమదైన స్టైల్ లో అడుగగా ఆ హత్య చేసింది, ఈ దాడికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: