మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి పని చెయ్యాలంటే.. ముందుగా అసలు అది ఎందుకు చెయ్యాలి ? అది చెయ్యటం వల్ల ఉపయోగం ఏంటి ? అది ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనేది తెలుసుకోవాలి. ఇవి అన్ని తెలుసుకోవాలంటే ముందు మనకు మంచి క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం. 

 

మనం సమాజంలో మార్పుని ఆశిస్తున్నాం.. మనం ఎలాంటి మార్పునైతే ఆశిస్తున్నామో, అలాంటి మార్పు ముందు మనలోనే రావాలి. మంచి హృదయం, మంచి ఆలోచన ఈ రెండూ అద్భుతమైన జ్యోతి లాంటిది. అతిగా ఆలోచించి ఊరికుండి పోవడం కన్నా మితంగానైనా ఆచరించడం హితంగానైనా జీవించడంలోనే విజయాలు దాగి ఉన్నాయి. 

 

బాధ్యతారహితమైన మాటలు ఇతరులకు మనపై ఉన్న ప్రేమను తగ్గిస్తాయి. శ్రమ ద్వారానే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ప్రపంచంలోని అన్ని భోగభాగ్యాల కంటే మంచి ఆరోగ్యంలో కూడుకున్న సుదీర్ఘ జీవితం ఎంతో మంచిది. ఏ పని చెయ్యాలన్న క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: