సంక్రాంతి పండుగ అంటే అందరూ సంతోషంగా జరుపుకోవాలి, ప్రజలందరూ పిల్లా పాపలతో సుఖంగా  ఉండాలని కోరుకుంటారు. మరి మన సంతోషం కోసం పర్యావరణాన్ని,మనతో పాటు సమాన హక్కు కలిగి జీవించే మూగ జీవాలకి హాని కలిగించడం ఎంతవరకూ సమంజసం అనేది ఒక్క సారి అందరూ ఆలోచన చేయాలి. గాలి పటాలతో పాటు పక్షులని కూడా ఎగరనిద్దాం అంటూ తెలంగాణా అటవీశాఖ చైనీస్ మాంజా పై నిషేధం విధించింది. ఈ మాంజా వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మేరకు స్వచ్చంద సంస్థలతో కలిసి ప్రచారం నిర్వహిస్తోంది..అంతేకాదు

 

చైనీస్ మాంజా వాడే వారిపై కటినమైన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తాము కూడా చైనా మాంజా వాడకాన్ని తెలంగాణలో నిషేధించామని  పీసీసిఎఫ్ శోభా తెలిపారు. పతంగులు ఎగురవేసే క్రమంలో చాలా మంది చైనా మాంజా వాడంటం జరుగుతోందని ఈ దారం నైలాన్ , సింధటిక్ తో కలిపి గ్లాస్ కోటింగ్ తో వాడటం వలన అత్యంత పదునుగా మారుతున్నాయని, ఈ కారణంతో గత ఏడాది పలు చోట్ల సుమారు 5 మంది వ్యక్తులు చిన్న పిల్లలు చనిపోయారని, లక్షల పక్షులు మృతి చెందాయని తెలిపారు.

 

అందుకే ఈ చైనా దారంపై నిషేధం విధించామని తెలిపారు. ఈ దారం ఎవరైనా అమ్మినా,ఎగుమతి చేసినా వారిపై చట్టరీత్యా కటినమైన చర్యలు తీసుకుంటామని అలాంటి వారికి ఐదేళ్ళ  జైలు శిక్ష, లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. అంతేకాదు ఎక్కడినా మనుషులకి గాని పక్షులు, జంతువులకి హాని వీటివల్ల జరిగితే అవి ఉపయోగించిన వారి కూడా శిక్షార్హులు అవుతారని తెలిపారు. దీని వాడకంపై ప్రజలు అవగాహన పెంచుకుంటే పూర్తిగా వీటిని నిషేధించవచ్చని అన్నారు. ఈ చైనా దారాల బదులు కాటన్ దారాలు వాడమని సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: