బాగా ఉడకపెట్టిన గుడ్డుపై పెంకులు తీయడమంటే అది నిజంగా అగ్ని పరీక్షే. ఎందుకంటే వేడి నీటిలో బాగా ఉడికిన గుడ్డు పై పెంకులు తీయాలంటే మన పెంకులు లేచిపోతాయి. చేతికి తగిలే వేడి సెగలు మనల్ని పెంకులు తీస్తుంటే మంట రేగే చేతి వెళ్ళు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. అయితే ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టుగా దీనికి కూడా ఒక చక్కని పరిష్కారం కనిపెట్టారు కొందరు. అత్యంత సులభంగా కోడి గుడ్డుపై పెంకులు తీసేయచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం.

 

ఉడికించిన కోడి గుడ్డుపై పెంకులు తీయాలంటే ఒక్కోసారి గుడ్డు పెంకుకు అతుక్కుపోయి చాలా చిరాకుగా అనిపిస్తుంది. అయితే ఇక కోడిగుడ్డుపై పెంకు తీయాలంటే అంతలా కష్టపడిపోవాల్సిన అవసర లేదని అంటున్నాడు ఓ నెటిజన్. అంతేకాదు ఎంత సులభంగా కోడిగుడ్డుపై పెంకు తీయచ్చో చెప్తున్నాడు. ఈ ప్రయోగం చూసిన వాళ్ళందరూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్రయోగం అంటే..

 

గుడ్డుని బాగా ఉడికించిన తరువాత ఓ గ్లాసులో నీళ్ళు తీసుకుని అందలో గుడ్డుని వేయండి. ఆ తరువాత చల్లని నీళ్ళు పోసి గ్లాసు పై భాగాన్ని గట్టిగా మూసి కొన్ని సెకన్ల పాట్లు అటూ ఇటూ బాగా ఊపండి.ఇలా చేయడం వలన గుడ్డు పై ఉన్న పెంకులు నెమ్మది నెమ్మదిగా ఊడిపోతాయి. యాంత్రికంగా గుడ్డుపై తోలు తీసినట్టుగా కేవలం 10 సెకన్ల లో  పెంకు మొత్తం వచ్చేస్తుంది. ఈ ప్రయోగాన్ని మీరు ఒక సారి ట్రై చేసి చూడండి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: