దేశానికే వెన్నుముక్కగా భావించే రైతన్నల యొక్క ప్రధాన పంట చేతికొచ్చే సంక్రాంతి కాలాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ద పండుగ' అని అంటారు. చాలా ఘనంగా జరుపుకునే మూడు రోజులు పండుగకు ఎంతో విశిష్టత ఉంది. మూడు రోజులలో మొదటి రోజును 'భోగి పండుగ' గా అందరం జరుపుకుంటాం. 'భగ' అనే పదం నుండి భోగి అనే మాట వచ్చింది. దక్షిణానికి ఆఖరి రోజైనా భోగిలో 'భగ' అంటే వేడి లేదా మంట పుట్టించడం అని అర్థం. అయితే భోగి రోజున 5 పనులు చేయడం తప్పనిసరి. వాటిలో మీరు ఎన్ని చేశారో ఒకసారి చూసుకోండి.

 

భోగి మంట

భోగిరోజున తెల్లవారకముందే ప్రజలంతా లేసి భోగిమంటలు వేస్తారు ఆవు పేడ, పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలను, తాటాకులు మరియు ఎండు పంట అవశేషాలను వేసి వాటితో పాటు ఇంట్లోని పాత వస్తువులు కూడా మంటల్లోకి విసిరి వేస్తారు. ఎవరు ఎన్ని ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారిని అంత గొప్పగా పరిగణిస్తారు. ఎలా చిన్నాపెద్ద అంతా కలిసి వేసిన మంటల్లో చలి కాచుకుంటారు. మంటలు వేయడం వెనకున్న పరమార్ధం పనికిరాని చెడు ఆలోచనలను వదిలించుకుని కాలంతో పాటు మనం స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు.

 

నలుగు స్నానం

భోగిమంటలు పూర్తి కాగానే తలకి, ఒంటికి నువ్వుల నునె పట్టించి మర్దన చేసుకొని కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చేయాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫ దోషాలు తొలగి పోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది

 

పులగం

భోగినాడు కొత్త బియ్యతో చేసిన పులగం తినటం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసర పప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే వంటకం రుచికే గాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది

 

బొమ్మల కొలువు

భోగినాటి సాయంత్రం చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను క్రమపద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు

 

భోగి పులక

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: