రోజు నుండి ముచ్చటైన సంక్రాంతి పండుగ ను దేశ వ్యాప్తంగా ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా కలిసి జరుపుకోవడం మొదలుపెట్టారు. మూడు రోజులపాటు జరిగే పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది అన్న ఆశతో భోగి, సంక్రాంతి, కనుమ అంటూ ప్రతి ఇంటా సంతోషంగా పర్వదినాలను జరుపుకుంటారు. దక్షిణాయనానికి చివరి రోజు రోజుగా భావించే భోగి రోజున దక్షిణాయన కాలంలో వారు పడ్డ బాధలను మరియు కష్టాలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించే రాబోయే ఉత్తరాయణ కాలంలో వారికి శాంతిని సమాధానాన్ని ప్రసాదించాలని కోరుకోవడమే భోగి పండుగ యొక్క విశిష్టత.

 

ఆవు పేడ, పిడకలు, మామిడి, రావి, మేడి చెట్లు అవశేషాలు మరియు ఎండిపోయిన ఆకుల భోగిమంటల వేయడమే కాకుండా ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగిమంటల్లో వేయడం ఆనవాయితీ. అయితే మన రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో మాత్రం భోగి పండుగను జరుపుకోరు. విజయనగరం జిల్లాలోని కొన్ని పల్లెల్లో పండుగకు దూరంగా ఉంటున్నాయి. పూర్వులు చెప్పిన విధంగా నేటి తరం కూడా పండుగను చేసుకోవడం లేదు. ఇదంతా కూడా పల్లెల్లో దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. పూర్వం భోగిమంటలు అదే సమయంలో ఏదో జరిగిందని నాటికీ పల్లెలో భోగి పండుగ కు దూరంగా ఉంటారు.

 

తెర్లాం మండలం తమ్మయ్య వలసలో భోగి పండుగ జరగకపోవడానికి కారణముంది. పూర్వకాలంలో భోగిమంట వేసిన రోజు. గ్రామంలో ఏదో అరిష్టం జరిగిందట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పండుగ ఊసే లేదు. బలిజపేట మండలంలోని సుభద్ర పంచాయతీ పరిధిలోని బడేవలస గ్రామంలో కూడా భోగి పండుగ కనిపించదు. వందేళ్ల కిందట ఇక్కడ జరిగే భోగిమంటల్లో ప్రమాదవశాత్తు ఒకరు మరణించారట. దీంతో పండుగ జరుపుకోవడం లేదట. రామభద్రపురం మండలం తారాపురం, బాడంగి మండలం పిన్నవలస, ముగడ గ్రామాల్లో కూడా భోగి పండుగ అంటే తెలియదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: