ఎంట్రో మంచి ఉసారు మీద ఉన్నావ్ ? ఇక్కడే ఎల్లిపోతున్నావ్ రా ? నేనా ఎక్కడికి ఎల్తాన్రా ? పందేలకి ఎల్తాన్నా ! యా ...? వత్తావా నువ్వగాని ? మరి రానా ? పందేల కోసమే కదరా ఎప్పట్నుంచో బాదాం పిక్క, మటన్ ముక్క ఎట్టి మేపింది. పొద్దు పొద్దున్నే కాల్వకాడికి తీసుకెళ్లి ఈత కొట్టించింది. అంటే నువ్వేనా నేను మా పుంజు ని మేపలేదనుకుంటున్నావా ?  నేను అలాగే మీపాను కదరా ! అయితే నా పుంజు మీద ఎత్తావా ? నీ పుంజు మీద ఛీ ఛీ అలాంటి సిన్న సిన్న పుంజుల మీద నేను ఎందుకు ఎత్తన్రో నా పుంజు పవరూ, రేంజు ఓ రేంజ్ లో ఉంటాద్రో ! నా పుంజు సూడు నీ పుంజు సూడు నా పుంజు మీద పందెం ఏసి గెలిసేద్దామనేనా ? అంతలేద్రో నీకు పెద్ద పందెం బిరికి తీసుకెళ్తున్నా నువ్వు ఈదుల్లో పందెం ఏస్కో ఎల్లి అంతేగాని నా పుంజు మీద ఎత్తనంటావేంట్రా ?

 

ఇప్పుడంతా గోదావరి పల్లెల్లో పందేల సందడేనండి బాబా ! పతి ఓడు పుంజునెట్టుకుని తుర్రు మంటూ ఎల్లిపోతున్నారండీ . పతి ఊరిలోనూ ఇదే తంతండే. జేబుల్నిండా డబ్బులు కుక్కేసుకుని సంకలో కోడినెట్టేసుకుని మీసాలు దువ్వెత్తూ ఎల్లిపోతున్నారు. ఇక పందెం బిరిల దగ్గర సూత్తే ఎక్కడ లేని కోళ్ళన్నీ అక్కడే ఉన్నాయ్. నెమలి, కాకి రసంగి, సీతువా, డేగ, మైలా, ఓర్నాయనో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పేర్లు ఉన్నాయండీ బాబా  ...! కోడి కాలికి కత్తులు కట్టెట్టేట్టన్నారు కదా అందుకే గామాలు రెండు పుంజులు కొట్టుకున్నప్పుడు సూత్తంటే తెగ బాధేసేత్తందండే. ఓరికి రక్తాలు కారిపోతున్నాయ్ ! అయ్యో పాపం అనడం తప్ప మనం పందేలు ఎయ్యొద్దంటే యింటారా ఏంటి ? పైగా నువ్వు సూడలేకపోతే ఇక్కడ నుంచి దొబ్బెయ్ అంటూ గాసిరేసుకుంటున్నారండి.


ఇక పందెం బిరిల దగ్గర ఒరికే మసాలా వాసన వచ్చేత్తాంది. ఎడి ఎడిగా పోకొడి సాఫులు, బిర్యానీ సాఫులు, ఓర్నాయనో ఊరికే మనసు లాగెత్తాంది. ఇంకో పక్క సూత్తే పందెంలో చచ్చిపోయిన పుంజులు (కోజా) ను కాల్చేత్తన్నారు. ఒరేయ్ ఈ కోజా నాకు అమ్మరా అంటూ ఒకడు ... నాకు కావాలని ముందే చెప్పను కదరా నాకు ఇవ్వరా అని ఇంకొకడు. యాండీ మా ఇంటికి సుట్టాలు వచ్చారు ఆల్లకు పందెం పుంజు వండిత్తానని సెప్పాను పీజ్ అండి నాకు అమ్మండి అని మరొకడు. ఓరి నయానో ఆడినట్టుకుని తెగ తినెత్తన్నారండి. ఆడు ఒకే తెగ బిల్డప్ ఇచ్చేత్తున్నాడు. నేను కూడా సేలా ఆలోచించాకా తెగించేసి ఓ కోజా కొనేద్దామని ఇంకో సోట యాండీ కోజా అమ్ముతారా ? ఎంత రేటు సెప్తున్నారు అని అడిగా కోజా ఐదు వేలు కావాలా అన్నాడు.


 ఓర్నాయనో అంత రేటా అంటే ఎప్పుడన్నా కోజా కొన్నావా ? పందెం పుంజు మాసం తిన్నావా ? తింటే తెలుత్తాది. జీడీ పప్పు, పదం పప్పు, మటన్ ఏసి మరి పెంచుతారు అందుకే ఇంత రేటు అన్నాడు ఆడు . ఆయన్ని నాకెందుకయ్యా రెండేలీకి ఇత్తావా అంటే ఎల్లెళ్లవయ్యా అంటూ గాసిరేసాడండి ! అయినా సంకిరన్తికి పందెం పుంజు మాసం అట్టికెళ్ళి వండించాల్సిందే. లేకపోతే సుట్టాలా ముందు సీపు అయిపోతాం కదండీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: