తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకునేందుకు అందరూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే పండుగకు ఎంతో విశిష్టత ఉంది. పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లలో భోగి మంటలు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్యన గొబ్బెమ్మలు... హరిదాసు కీర్తనలు.. కుర్రకారు కేరింతలు.. పల్లెటూరి పడుచుల అందాలు.. కోళ్ల పందాలు.. ఎడ్ల పందాలతో ఎంతో సరాదాగా జరుపుకునే పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి చేరుకుంటారు.

 

అంతేకాకుండా సంక్రాంతికి కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. సంక్రాంతి నాడు జరిగే కోడి పందాలకు గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెమలి, కాకి, డేగ, పింగళ అంటూ కోళ్లకు రకరకాల పేర్లు పెట్టి తమ మీసాన్ని పౌరుషానికి తిప్పి పందేళ్లలోకి దింపుతారు. ముఖ్యంగా ఇటువంటి కోడి పందాలకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాలో పల్లె సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలే. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ధనిక పేద అనే తేడా లేకుండా పందేలు ఎక్కడ జరుగుతుందో అక్కడ వాలిపోతారు.

 

ఇక్కడ పందాలు ఎంత ఫేమస్ అంటే క్రీడల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా తమ కోళ్లను సిద్ధం చేసుకుని వస్తుంటారు. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. ఇక్కడే కాకుండా కోళ్ల పందాలు ఎక్కువగా గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఇతర కోస్తా జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంటాయి.

 

ఉభయగోదావరిలో కోడి పందెలా ప్రత్యేత ఏంటంటే, ఒక సారి పుంజు పెందెంలో గెలిచిందంటే రెట్టింపు ధర పలుకుతుంది. ఎన్ని సార్లు విజయం సాధిస్తే అంతకంతకూ కోడి ధర పెరిగి వేల నుండి లక్షలకు చేరిపోతుంది. క్షణాల్లో పోటి ముగిస్తుంది, లక్షలు, కోట్లు చేతులు మారుతుంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: