సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. సంవత్సరంలో ఒక్క పండుగకు వేసే వందలాది రకాల ముగ్గులు మిగిలన రోజులన్నింటిలో కూడా వేయరు. అటువంటి పండుగలో చివరి రోజైన కనుమ పర్వదినం నాడు రెండు ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది. రెండు ముగ్గులకు కనుమ రోజు పెట్టింది పేరు.

 

మూడు చేపలు నీళ్ళల్లో ఈదులాడుతున్నట్టు కనిపించే ముగ్గు నిజానికి ఒక సాంసృతిక చిహ్నం. మత్వ్సకారులు తమ రాజ ముద్రగా అలంకరించుకోదగిన అరుదైన ప్రతీక. కనుమ రోజునే కానవచ్చే చిత్రాన్ని గురించి రోజే తప్పక చర్చించుకోవాలి. సరిగ్గ కనుమ రోజున ఆమె చిత్రం వాకిట్లో గీయడం విశేషం. నిజానికి నాడు అందరి వాకిళ్లలో రథం ముగ్గు ఊరేగుతుండగా బాలమణి గారి ఇంటి ముందు మాత్రం  ‘మత్య్సం’ మూడు పువ్వులుగా వికసించడం నిజంగా అబ్బురపరిచిందనే చెప్పాలి.

 

సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మ లతోను అలంకరిస్తారు.

 

సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు, తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులే.

మరింత సమాచారం తెలుసుకోండి: