ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలనే ఆలోచనతోనే ప్రయత్నాలను మొదలుపెడతారు. కానీ విజయం సాధించాలనే ప్రయత్నంలో చేసే కొన్ని తప్పుల వలన విజయానికి దూరమవుతారు. చాలామంది ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ప్రయత్నాలను మొదలుపెట్టినప్పటికీ నిర్లక్ష్యం వలన అనుకున్నది సాధించలేకపోతున్నారు. విజయం కోసం ప్రయత్నించేవారు క్షణం వృథా చేసినా ఎంతో కొంత కోల్పోయినట్లే అని గుర్తుంచుకోవాలి. 
 
విజయం సాధించటానికి వేసుకున్న ప్రణాళికను అనుకున్న ప్రకారం పూర్తి చేసి లక్ష్య ఛేధన దిశగా అడుగులు వేయాలి. ఎక్కువ ప్రయత్నం చేస్తేనే ఎక్కువ ఫలితం... తక్కువ ప్రయత్నం చేస్తే తక్కువ ఫలితం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేసే పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అనుకున్నది సాధించలేక జీవితాంతం బాధ పడాల్సి రావచ్చు. మనం ఎంచుకున్న లక్ష్యమే శ్వాసగా, ధ్యాసగా జీవించాలి. 
 
ఏదీ ఒక్కరోజులో సాధించలేమని చిన్నచిన్న లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకు అడుగులు వేయాలని గుర్తుంచుకోవాలి. మంచైనా, చెడైనా మన ఆలోచనలే వాస్తవాలు అవుతాయని ఆ ఆలోచనల్లో నిర్లక్ష్యం చేరితే నిరాశజనకమైన ఫలితాలే వస్తాయని గుర్తుంచుకోవాలి. సమయం వృథా అవుతున్నట్టు అనిపిస్తే ఎక్కడ వృథా అవుతుందో తెలుసుకొని పూర్తి చేయాలి. చేద్దాంలే... చూద్దాంలే అనుకుంటే మాత్రం ఆ నిర్లక్ష్యానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ చేసే పనిలో నిర్లక్ష్యాన్ని వీడి ముందడుగు వేయాలి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: