ఇప్పుడు అందరికీ టెక్నాలజీ ఎంతగానో అందుబాటులో ఉంటోంది. అంతా ఇప్పుడు సోషల్ మీడియాను వాడుతున్నారు. కానీ.. చాలా మంది కేవలం వాట్సప్, ఫేస్ బుక్, టిక్ టాక్ లతోనే ఆగిపోతున్నారు. అక్కడే వారి ఖాళీ సమయం కాస్తా సరిపోతుంది.

 

కానీ మనం నిజంగానే అప్ డేట్ కావాలి. మన సౌలభ్యం కోసం అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల భద్రత కోసం అనేక యాప్ లు ఉన్నాయి. మనకు ఉపయోగపడే యాప్స్‌, ఆన్‌లైన్‌ ఛానెళ్లు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడం తెలియాలి.

 

సైబర్‌మిత్ర, షీటీమ్స్‌, హాక్ ఐ వంటి సెక్యూరిటీ యాప్స్‌ను కచ్చితంగా ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అవి మీకు తోడుగా ఉంటాయి. కాకపోతే.. వాటి గురించి మనం అప్ డేట్ అవ్వాలి. టెక్నాలజీని వాడుకోవడం తెలిస్తే చాలా పనులు సులభంగా జరిగిపోతాయి. మన జీవితం మరింత సౌకర్య వంతం అవుతుంది. అలా మిగిలిన సమయం మిగిలిన పనులకు సద్వినియోగం అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: