లండన్‌లో ఓ సదస్సులో ప్రసంగిస్తూ నిమ్స్ సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్‌ మీనాకుమారి గుండెపోటుతో కుప్పకూలిన సంగ‌తి తెలిసిందే. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌ పై చికిత్స అందించారు. లండన్ వైద్యులు ఆమె గుండెకు మూడు స్టెంట్లు వేసారు. హార్ట్ ఫెయిలై దాని ప్రభావం మెదడుపై తీవ్రంగా పడినట్లు లండన్ వైద్యులు వెల్లడించారు. అయితే  అంత్యత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్‌ చేసిన యూకే డిప్యూటి హై కమిషనర్‌ డా.ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఆమె కుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 


ఈ అనూహ్య ఘటనతో ఆమె కుటుంసభ్యులు, నిమ్స్‌ వైద్యులు, ఆసుపత్రి సిబ‍్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమిళనాడుకు చెందిన మీనాకుమారి ఎన్నో ఏళ్ల క్రిందటే భాగ్యనగరానికి వచ్చి స్థిరపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో ఆమె 25 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఫ్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. అయితే నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మీనాకుమారి అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనడానికి ఇటీవల లండన్ వెళ్లారు. 

 

అక్కడ సదస్సులో ఉపన్యసిస్తుండగా ఆమె గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మీనాకుమారి ఆరోగ్యం విషమించడంతో లండర్ వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కాని, ఉప‌యోగం లేకుండా పోయింది. ఇక ఈ  అనూహ్య ఘటనతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, లండన్‌ పౌరసత్వం కలిగిన ఓ వైద్యుడిని నిమ్స్‌ ఖర్చులతో మీనాకుమారి వద్దకు పంపిస్తున్నట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ మనోహర్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: