అతని వయసు 28 ఏళ్ళు.. కానీ ప్రపంచ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. 19 సంవత్సరాలకే ప్రపంచం అంత పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి.. ఏంటి అనుకుంటున్నారా ? చుడండి..  పూర్తి వివరాల్లోకి  వెళ్తే.. నేపాల్‌లోని బాగ్‌లంగ్‌ జిల్లాలో ఓ చిన్న గ్రామంలో 14 అక్టోబర్‌, 1992న ఖాగేంద్రథాపామగర్‌ జన్మించాడు. 

 

అయితే అతను ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తిగా పేరు గాంచాడు. చిన్నవయసులోనే గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. 2010 లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా ఖాగేంద్ర థాపామగర్‌ గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అయితే గిన్నిస్ రికార్డ్స్ లో పేరు పొందినా ఖాగేంద్ర థాపామగర్‌ గత కొద్ది కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. 

 

ఈ నేపథ్యంలోనే అయన ఈరోజు మరణించాడు. ఖాగేంద్ర థాపామగర్‌ మరణించిన విషయాన్నీ స్వయంగా గిన్నిస్‌ రికార్డు యాజమాన్యం ధ్రువీకరించింది. రూప్‌ బహదూర్‌, ధన్‌మాయ దంపతులకు ఖాగేంద్ర థాపామగర్‌ పెద్ద కుమారుడు. 2010లో అతన్ని అతి పొట్టి వ్యక్తిగా ప్రపంచం గుర్తించి.

 

2011లో అతనికి మంచి పాపులారిటీ లభించింది. ఆ సంవత్సరంలో ఖాగేంద్ర నేపాల్‌ టూరిజం గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించబడ్డాడు. ఖాగేంద్రకు గిటార్‌ వాయించడమంటే చాలా ఇష్టం. అలాగే అతని సోదరులతో బైక్‌పై షికార్లు కొట్టేవాడని అతని తల్లితండ్రులు రూప్‌ బహదూర్‌ గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: