ఈ మధ్య కాలంలో యువత చెడు వ్యసనాలకు బానిసై క్షణికావేశంతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిస కావడం వలన అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. యువతలో చాలామంది మద్యం, ఈవ్ టీజింగ్, సెల్ ఫోన్ చాటింగ్ లతో కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఆధునిక ప్రపంచంలో చెడు వ్యసనాలకు బానిసలు కావడం వలన విజయాలను సాధించడం అంత తేలిక కాదు. 
 
అలా కాకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కాలాన్ని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వలన భవిష్యత్తు తరాలకు పునాదులను వేసుకోవచ్చు. చెడు వ్యసనాలపై అవగాహన పెంచుకొని వాటికి దూరంగా ఉంటే మంచిది. చెడు వ్యసనాల వలన తాత్కాలికంగా ఆనందం పొందినా ఆ వ్యసనాలు భవిష్యత్తునే అంధకారంలో పడేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెడు వ్యసనాలు, చెడు కార్యాలపై ఆసక్తి లేకపోతే ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయం సాధించడంతో పాటు వారు మంచి పేరు ప్రఖ్యాతలను, ప్రతిష్టలను పొందుతారు. 
 
వ్యసనాల బారిన పడటం వలన తమ భవిష్యత్ నాశనం అవుతుందనే కాకుండా కన్నవారిని కూడా మోసం చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలమంది యువకులు సినిమా పోకడలను అనుకరిస్తూ ప్రేమ పేరుతో యువతులను వేధింపులకు గురి చేస్తూ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించటం ద్వారా ఉన్నత భావాలను అలవరచుకోవడం ద్వారా సమాజం గౌరవించే స్థాయికి ఎదిగి జీవితంలో ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తామని గుర్తుంచుకోవాలి. అందువలన చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే విజయాలను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: