కోరనా మహమ్మారి కమ్ముకోచ్చేస్తోంది. చైనా లో మొదలైన ఈ వైరస్ అక్కడి ప్రజలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఇప్పటికే ఈ వ్యాధి బారిన పది సుమారు 60 మందికి పైగానే ప్రాణాలు కోల్పోగా దాదాపు 1975 మంది ఆసుపత్రులులో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఎఫ్ఫెక్ట్ సోకినా వారికి మరో రెండు ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన చైనా ప్రభుత్వం ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదిలాఉంటే

 

కోరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనా ప్రయాణం అయ్యే వారు ఎవరైనా సరే వెంటనే వారి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించాయి. ఈ క్రమంలోనే చైనా నుంచీ తమ దేశాలకి వచ్చే వారికి ఎయిర్పోర్ట్ లోనే పరీక్షలు చేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికాని పలకరించిన రెండు కేసులు నమోదు చేసుకున్న కరోనా మరిన్ని దేశాలకి సైతం విస్తరించింది...

 

థాయిలాండ్ , హాంకాంగ్ , మలేషియా, సింగపూర్, మకావో, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ , సౌత్ కొరియా, తైవాన్ , అమెరికా , నేపాల్, దేశాలు ఈ వైరస్ ధాటికి వణికిపోతున్నాయి. పై దేశాలకి వెళ్ళే వారు ఎవరైనా సరే వెంటనే వారి వారి ప్రయత్నాలు ఆపేయాలని, లేదా అక్కడికి వెళ్ళే కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తోంది భారత ప్రభుత్వం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: