మన దేశంలో ప్రత్యేకమైన వంటకాలను అందించే రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది భోజన ప్రియులు కేవలం వారికి నచ్చిన భోజనాన్ని తినటానికి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన వారికీ ఈ అనుభూతి జీవిత కలం మిగిలిపోతోంది. అలా భోజనాన్ని, వంటకాలను అందించే  రైల్వే స్టేషన్స్ ను గురించి తెలుసుకుందాం.. 


మొదట పంజాబ్ లోని జలంధర్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేకంగా లభించే ఛోలే భాతుర్ రుచిని మరేదీ ఉండదేమోననిపిస్తుంది. మీరు ఎప్పుడైనా జలంధర్ ను సందర్శించినప్పుడు ఛోలే భాతుర్ ను తప్పకుండా టేస్ట్ చేయండి అసలు మిస్ చేయకండి. అలాగే కేరళలోని ఎర్ణాకులం ప్రాంతంలో గల ప్రత్యేకమైన వంటకాల్లో పజంపోరి ఒకటి. ఈ స్నాక్ ను అరటి పండుతో తయారు చేస్తారు. అరటి పండును పొడవుగా కోసి దానిని ఒక మిశ్రమంలో ముంచి నూనెలో బాగా వేయిస్తారు. టీ తాగుతూ చట్నీతో పాటు ఈ వంటకాన్ని ఎక్కువగా తింటుంటారు. ఎంతో రుచికరమైన పజంపోరి కేరళలోని ఎర్ణాకులం రైల్వే స్టేషన్ లో దొరుకుతుంది. ఎప్పుడైనా ఈ స్టేషన్ గుండా వెళ్లినప్పుడు ఈ వంటకాన్ని ట్రై చేసి చూడండి.

 

ఒకవేళ మీరు ఎప్పుడైనా కర్ణాటకలోని ముద్దూర్ ప్రాంతానికి వెళితే.. అక్కడ ప్రసిద్ధ వంటకం అత్యంత రుచి కరమైన ముద్దూర్ వడను తినండి. ముద్దూర్ వడ ముద్దూర్ రైల్వే స్టేషన్ లో దొరుకుతుంది. అలాగే.. ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ కి వెళితే.. అక్కడి ఫెమస్ అయిన ఆలూ సువాసనలు మీలో ఆకలిని రేకెత్తిస్తాయనుకోండి. దీని వాసనతో నోట్లోంచి లాలాజలం వచ్చేస్తుంది. కాబట్టి ఒక ప్లేటు నిండా ఈ వేడి వేడి రుచికరమైన దమ్ ఆలూను నింపుకుని తనివితీరా ఆరగించండి. దమ్ ఆలూతో పాటు కొంచెం గ్రేవీను కూడా అందిస్తారు. ఇవి నిజంగా ఎంతో రుచికరంగా ఉంటాయి.

 

కాబట్టి ఫ్రెండ్ మీరు ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళితే.. అక్కడి ఫెమస్ అయిన వంటకాలను టేస్ట్ చేయండి. మాములుగా మీరు టూర్ కి వెళ్ళినపుడు మాత్రం ఇలాంటి ఛాన్సెస్ ని మిస్ చేసుకోకండి. ఎందుకంటె ఇలాంటివి జీసీతంలో మనకు ఒక మధురానుభూతులుగా మారుతాయి.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: