నేటి మంచిమాట ఇది.. ఎంత కష్టపడుతున్నావో చెప్పకు.. ఎంత పని పూర్తయ్యిందో చెప్పు. కానీ ప్రజలు దీనికి వ్యతిరేకం. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది చెప్తారు తప్ప పని పూర్తయ్యిందో లేదో చెప్పారు ఇది నేటితరం స్వభావం. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు తప్ప పని పూర్తి చేశామా లేదా అనేది చేసుకోరు. 

 

కొందరు సాఫ్ట్ వెర్ ఇంజినీర్లు చెప్తారు.. ఎంత కష్టపడుతున్నామో తెలుసా? ఎంత శ్రమిస్తున్నామో తెలుసా అని.. కానీ డెడ్ లైన్ పూర్తయిన వాళ్ళ పని పూర్తి అయ్యి ఉండదు.. చివరికి బాస్ తో చివాట్లు తింటారు. అదే ఆ గొప్పలు చెప్పుకునే శ్రద్ద పనిపై చూపిస్తే చివాట్లు తినరు కదా.. కానీ పడుతారు. 

 

అది వారి స్వభావం. అందుకే మీరు అయినా ఎంత కష్టపడ్డామో తెలుసా అంటూ గొప్పలు చెప్పుకోకుండా వాస్తవానికి రండి. మీ పని పూర్తి చేసుకోండి.. అందరికి మంచి చెయ్యండి.. మంచి పేరు తెచ్చుకోండి. అనవసర విషయాలకు వెళ్లి కష్టాలు పాలవ్వకుండా.. ఎంత కష్టపడుతున్నారు అనేది పక్కన పెట్టి పని పూర్తి చెయ్యడం.. విజయాన్ని సొంతం చేసుకొండి. 

  
  

మరింత సమాచారం తెలుసుకోండి: