కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఇది. క్షణాల్లో ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ప్రాణాలను హరిస్తోంది. దీంతో అన్ని దేశ ప్రజలు కూడా వణికిపోతున్నారు. పాముల నుంచి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న వైద్య నిపుణులు.. దీన్ని తొలిసారిగా చైనాలో గుర్తించారు. దీని ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే చాలా మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ లక్షణాలు చూస్తే ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది.తలనొప్పి, జ్వరం , దగ్గు , గొంతులో మంట ఉంటాయి .ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు.

 

అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. మ‌రోవైపు ఇండియాలో కూడా మొదటి కేసు కేరళలో నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి.  అయితే ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ణికిస్తున్న ఈ క‌రోనా వైర‌స్ తెలంగాణా రాష్ట్రాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కరోనా వైరస్‌ కారణంగా హడలెత్తిపోతుంది. ఈ నేప‌థ్యంలోనే ఇక హైదరాబాద్ లో దీనికి సంబంధించి ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేశారు.  

 

24 గంటల పాటు కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా అనుమానితులు ఉంటె వెంటనే 040 24651119 కు ఫోన్ చేయాలని వెల్ల‌డించారు.  వైరస్ సోకినట్టుగా అనుమానం ఉంటె వెంటనే వారిని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.  కేంద్రం ఇప్పటి హైదరాబాద్ కు మెడికల్ కిట్స్ ను పంపిణి చేసింది.  రేపటి నుంచి ఈ వైద్యం అందుబాటులోకి రాబోతున్నది. కాగా, చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకూ  11 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రియు ఎంద‌రో హాస్ప‌ట‌ల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: