వింటే భారతం వినాలి.. తింటే తెలుగోడి గారే తినాలి.. అంటూ పెద్దలు చెప్పారు.. అది నిజమేనండీ.. మమకారం ఉప్పు కారం అన్నీ భారతీయులకు ఎక్కువనే చెప్పాలి..అయితే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రుచులు అంటే ఎంటో ఇప్పుడు చూద్దాము...సెలబ్రేషన్ చేసుకోవాలన్నా.. బిర్యానీ ఉండాల్సిందే. అయితే, ఈ ట్రెండ్ కేవలం ఇండియాలోనే ఉందనుకుంటే పొరపాటే. ఇతర దేశాలు కూడా బిర్యానీ కోసమే తహతహలాడుతున్నాయట. 2019లో ప్రపంచంలో అత్యధికంగా ఏ వంటకాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు, దేనికి అధిక సెర్చ్ ఉందనే విషయంపై ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. 

 

ఈ నేపథ్యంలో..ఇందులో బిర్యానీయే మొదటి స్థానంలో ఉంది.బిర్యానీతోపాటు బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరీ చికెన్, పాలక్ పనీర్, నాన్, డాల్ మకినీ (రెడ్ బీన్స్), చాట్ వంటివి ఉన్నాయి. ప్రతి నెల బిర్యానీ కోసం 4.56 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. పంజాబీ వంటకమైన బటర్ చికెన్ కోసం సుమారు 4 లక్షల మంది సెర్చ్ చేశారు. సమోసా 3.9 లక్షలతో దాని తర్వాతి స్థానంలో ఉంది....

 

మరో వంట కూడా భోజన ప్రియుల ఆకట్టుకుంటూ అంటున్నారు.. అదేంటో అంటే..పంజాబీ వంటకం చికెన్ టిక్కా మసాలా కోసం 2.5 లక్షల మంచి చెక్ చేశారు. దక్షిణాది వంటకం దోశా కోసం 2.28 లక్షల మందితో ఐదో స్థానంలో ఉంది. దీని తర్వాతి ఐదు స్థానాల్లో తందూరీ చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్ మఖానీ, చాట్ ఉన్నాయి...అందుకే ఇతర దేశాల వాళ్లకు మన వంటలు అంటే చాలా ఇష్టం...

 

రుచుల పరంగా భారతీయుల వంట ఏదైనా కూడా అదుర్స్ అనే చెప్పాలి.. పర్యాటకులు అందుకే అంటున్నారు.. వి లైక్ స్పెైసి ఇండియన్ ఫుడ్ అని..అంతా మన భారతీయ సంస్కృతిలో భాగం మాత్రమే..ఆకలి అన్న వాళ్లకు కడుపునిండా భోజనం పెట్టడం మన వాళ్ళ మంచి తనం..అందుకే మన దేశ సంస్కతికి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఎంతైనా కూడా భారతీయుల జ్యాతి ఖ్యాతి రెండు మాటల్లో చెప్పలేనని చెప్పాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: