అవును.. మీరు విన్నది నిజం. మంచి కోసం చేసే పోరాటం ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. ఎందుకంటే మనం మంచి చెయ్యాలి అనే తపనతో మరికొందరికి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో చేసిన సమయంలో మనం ఓడిపోయినా సరే అది గెలుపే అవుతుంది. గెలుపు అంటేనే మంచి.. ఇంకా మంచి చెయ్యాలి అనుకుంటే గెలుపు కూడా సాధ్యమే కదా!

 

అందుకే మనం ఒకొక్కసారి మంచి కోసం అని అటు వైపు బలవంతుడు ఉన్నాడు అనే విషయాన్నీ కూడా మరిచిపోయి పోరాటానికి వెళ్తాము.. కానీ అక్కడికి వెళ్ళాక దారుణంగా ఓడిపోయి వస్తాము. అయినా సరే.. ఇంకా అప్పుడే.. మనం ఎవరికైతే మంచి చెయ్యాలి అనుకుంటామో.. మనం ఓడిపోయినప్పుడు వారే మానవద్దకు వచ్చి మనకు అండగా నిలుస్తున్నారు.

 

మనం ఒకరి కోసం వెళ్లి పోరాటం చేస్తే మనకోసం ఎందరో వస్తారు. ఇది జీవిత సత్యం. కావాలంటే మీరు చరిత్ర కూడా తిరిగేయండి.. స్వతంత్ర పోరాటంలో కూడా ఉద్యమకారుడు గెలిచినా సమయం కంటే కూడా ఓడిపోయినప్పుడే అతనితో ఎక్కువ మంది నడిచిన రోజులు ఉంటాయి. అందుకే అంటారు పెద్దలు మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: