అయ్యో కరోనా.. మరి ఇంత దారుణం ఏంది నువ్వు? ప్రేమికుల రోజు ఒక్కటి మాయం అయిపోయి మళ్ళి రాపో అని బాధ పడుతున్నారు ప్రేమికులు.. ఎందుకంటే.. కరోనా వైరస్ వచ్చింది.. ప్రజలను వణికిస్తోంది.. ప్రస్తుతం ప్రపంచ ప్రజలంతా ఏ విషయం గురించి అయినా బాధ పడుతున్నారు.. భయపడుతున్నారు అంటే అది కరోనా వైరస్ గురించే.. 

                 

చైనాలో పుట్టిన అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ మనుషుల జీవితాలతో దారుణంగా ఆడుకుంటుంది. ఎంత దారుణంగా అంటే.. మనిషిని అత్యంత దారుణంగా చంపేలా.. అత్యంత ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్.. గాలి ద్వారానే వ్యాపించడం వల్ల ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకునే పరిస్థితి వచ్చింది. 

                

అందుకే ప్రజలు అందరూ మాస్కులు వేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే మరో 11 రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది.. ప్రేమికులు అందరూ ఈ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటారు. అంత ఘనంగా చేసుకునే ఈ ప్రేమికుల దినోత్సవంను ఈసారి మాస్కులతో చేసుకోవాలి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఫీల్ అవుతున్నారు. 

                        

ఇంకా ముద్దులు కూడా మాస్కుల్లోనే పెట్టుకోవాలి.. కరోనా వైరస్ ఎఫక్ట్ ఇది అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు... అవును మరి.. ఈసారి చాల జాగ్రత్తలు తీసుకోవాలి.. కరోనా వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి.. లేదంటే కరోనా భారిన పడి మరో ప్రేమికుల దినోత్సవంకు మనం బతకం అంటూ నెటిజన్లు జోకులు మీద జోకులు వేస్తున్నారు. మరి ఈ ప్రేమికుల దినోత్సవాన్ని మీరు ఎలా చేసుకోబోతున్నారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: