పిల్ల‌ల ముందు పెద్ద‌లు దెబ్బ‌లాడుకోవ‌డం వ‌ల్ల అలాంటి విష‌యాలు పిల్ల‌ల పై తీవ్ర ప్ర‌భావం జ‌రుగుతుంది. అలాంటి స‌మ‌యాల్లో మాన‌సిక ఒత్తిడికి కూడా లోనయ్యే సంద‌ర్భాలు ఉంటాయి. ఇంట్లో జ‌రిగే ఆరోగ్యాల మీద నిజంగా ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులకు తమ చిన్నారితో సంబంధం ఎలా ఉంటుందనేదే కాదు.. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా చిన్నారి సంక్షేమంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి.. చదువుల్లో రాణించటం వరకూ.. భవిష్యత్తులో చిన్నారుల సంబంధ బాంధవ్యాల వరకూ ప్రతి అంశం మీదా అవి ప్రభావం చూపగలవు. అయితే.. అన్ని గొడవలూ ఒకే రకమైన ప్రభావం చూపవు. ఒక 'పాజిటివ్‌' వివాదం మంచి ప్రభావం చూపే అవకాశమూ ఉంది.

 

చాలాసార్లు.. తల్లిదండ్రుల వాగ్వాదాలు చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపవు. కానీ.. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు కోపావేశాలు వ్యక్తం చేసుకుంటూ పెద్దగా కేకలు వేసుకున్నపుడు.. కొంత మంది పిల్ల‌లు భ‌య‌ప‌డ‌తారు.  కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు. తరచుగా సంఘర్షణలను చూసే, వినే చిన్నారులు - ఆరు నెలల వయసు పిల్లలు సైతం - గుండె కొట్టుకునే వేగం పెరగటం, ఒత్తిడి హార్మోన్లు స్పందించటం వంటి వాటికి లోనుకావచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. ఘర్షణ స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ దానిని కొనసాగిస్తున్న తల్లిదండ్రులతో ఉండే పిల్లల మీద కూడా ఇటువంటి ప్రభావాలు పడే అవకాశముంది. అయితే.. ఘర్షణలను నిర్మాణాత్మకంగా చర్చించుకునే, పరిష్కరించుకునే తల్లిదండ్రులతో నివసించే పిల్లల్లో ఈ ప్రభావాలు తక్కువగా కనిపిస్తాయి.

 

పిల్లల కోసం వాదన మొదట.. తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు, పరస్పరం విభేదించటం అతి సాధారణమైన విషయమేనని గుర్తించటం ముఖ్యం. అయితే.. తరచుగా, తీవ్రమైన, పరిష్కారం లేకుండా ఘర్షణలు పడినపుడు.. అవి పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆ గొడవలు ఆ పిల్లల గురించే అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఆ గొడవకు తామే కారణమని పిల్లలు తమను తాము నిందించుకునే పరిస్థితులు. వీటివల్ల పడే ప్రతికూల ప్రభావాల్లో.. పిల్లలు సరిగా నిద్రపోలేకపోవటం, పసివారిలో మెదడు అభివద్ధికి ఆటంకాలు ఏర్పడటం, ప్రైమరీ స్కూలు పిల్లల్లో ఆందోళన, నడవడిక సమస్యలు, కొంచెం పెద్ద పిల్లలు, యుక్తవయస్కుల్లో కుంగుబాటు, చదువుల్లో వెనుకబడటం, తమకు తాము హాని చేసుకోవటం వంటి ఇతర తీవ్ర సమస్యలు వంటివి ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: