పసిపిల్లలను ఆకస్మిక మరణం సంభవించే పరిస్థితి (సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్) నుంచి రక్షణగా.. కనీసం పుట్టిన మొదటి ఆరు నెలల పాటు.. వీలైతే సంవత్సరం నిండే వరకూ.. తల్లితో ఒకే గదిలో ఉంచటం మంచిదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఫారసు చేస్తోంది. అయితే.. తల్లీ బిడ్డలు తొలి నెలల్లోనే వేర్వేరు గదుల్లో నిద్రించటం వల్ల ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఎమిలీ.

 

మీ చిన్నారి, మీరూ ఒకే గదిలో ఉండాలనుకుంటే నిరభ్యంతరంగా ఉండొచ్చు. తొలి రోజుల్లో తల్లీబిడ్డలు ఒకే గదిలో ఉండటం మంచిదని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. కానీ.. ఏడాది పాటు తల్లీబిడ్డలను ఒకే గదిలో ఉంచటం వల్ల స్పష్టమైన ప్రయోజనాలేమీ కనిపించటం లేదు. పైగా, ఇరువురూ తక్షణమే కాదు, దీర్ఘకాలంలోనూ నిద్రను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది'' అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

అలాగే పిల్లలు, పెద్దవాళ్లు పక్కపక్కన సోఫా మీద పడుకోవటం చాలా ప్రమాదం పిల్లలు పడుకునే ప్రదేశాలన్నిటిలోకీ, ఒకటి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది: పెద్ద వాళ్లతో కలిసి పిల్లలు కూడా ఒకే సోఫా మీద పడుకోవటం. ఇది సాధారణ రిస్కు కన్నా దీనివల్ల మరణాల రేటు 20 నుంచి 60 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి అలా చేయవద్దు. అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

 

పిల్లలను దుప్పటితో చుట్టవచ్చు. పిల్లల తొలి నెలల్లో దుప్పట్లలో చుట్టటం వల్ల వారు ఏడవటం తగ్గటంతో పాటు నిద్ర పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెప్పాయి. అయితే, ఇలా దుప్పటి చుట్టినపుడు చిన్నారి కాళ్లూ, పిరుదులు కదలించటానికి వీలు ఉండేలా చూడటం చాలా ముఖ్యం.బుడుగు: పసిపిల్లలను వేరే గదిలో పడుకోపెట్టవచ్చా.

మరింత సమాచారం తెలుసుకోండి: