చాలామంది చాలా సందర్భాలలో తమని తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అలా తమను తామే మోసం చేసుకోవడం వలన జీవితంలో లక్ష్యాన్ని సాధించేంత ప్రతిభ ఉన్నా లక్ష్యాలను సాధించలేక విజయానికి దూరంగా ఉండిపోతూ ఉంటారు. సాధించేంత సత్తా ఉండి కూడా తమపై తమకు ఉండే అతి నమ్మకం వలనో, నిర్లక్ష్యం వలనో విజయాలను సాధించలేకపోతూ ఉంటారు. సమాజంలో ఇలా అతి విశ్వాసం వలన విజయాలనికి దూరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
ఇతరులు కళ్ల ముందే విజయాలు సాధిస్తుంటే అది వారి ప్రతిభ కాదని అవతలివారు మోసం చేసి విజయం సాధించారని చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ అలా అవతలివారిపై ఆరోపణలు చేస్తున్నామంటే ఒక రకంగా మనల్ని మోసం చేసుకున్నట్టే అని గుర్తుంచుకోవాలి. విజయం సాధించాలంటే కష్టపడటం తప్ప మరొ దారి ఉండదని గుర్తుంచుకోవాలి. ఇతరులపై ఆరోపణలు చేస్తూ ఉండటం వలన జీవితంలో మనమే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. 
 
జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనం మోసం చేసుకోకుండా మన పొరపాట్లను, తప్పులను గుర్తిస్తూ ముందడుగు వేయాలి. సమస్యలు ఎదురైతే ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించి ముందడుగు వేయాలి. మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటూ కలల్లో విహరిస్తూ కాలం గడపటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువలన జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనం మోసం చేసుకోకుండా మనలోని తప్పులను సరిదిద్దుకుంటూ ముందడుగులు వేయాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: