సహజంగా పిల్లలకి ముందు నుంచీ తల్లే సర్వస్వం, ఎందుకంటే పిల్లలకి ఏది చేయాలన్నా తల్లే చేస్తుంది. తండ్రి ఉద్యోగ భాద్యత, కుటుంభ పోషణ వంటి విషయాలలో బిజీ బిజీ అయిపోవడంతో పిల్లలకి, తండ్రికి మధ్య బాండింగ్ పెద్దగా కనిపించదు. అంతేకాదు తల్లి లాలనగా ముద్దు చేస్తూ ఉంటే, తండ్రి గంభీరంగా ఉంటూ తప్పు చేస్తే ఎక్కడ కొడతాడో నాన్నా అనేలా భయాన్ని పెడుతూ ఉంటారు. అయితే తండ్రి పిల్లలతో కాసేపు హాయిగా సరదాగా గడపాలంటే సమయం దొరకదు...ఇలా పిల్లల చిన్ననాటి గుర్తుల అనుభూతిని తండ్రి పొందలేకపోతాడు. ఈ పరిస్థితిని గమనించిన ఫిన్లాండ్ ప్రభుత్వం అందుకు ఓ ఆలోచన చేసింది...

 

నానాటికి క్షీణిస్తున్న తల్లితండ్రుల సంభందాన్ని బలోపేతం చేయడానికి కుటుంభ ప్రయోజనాలు కాపాడటానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తల్లులకి మాత్రమే ఇచ్చే పేరెంట్ లీవ్ ని తండ్రులకి కూడా వర్తింప చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి తండ్రులు తహతహలాడుతున్నారని మేము తీసుకున్న ఈ నిర్ణయం ఈ దేశంలో ఉన్న తండ్రులు సంతోషం వ్యక్తం చేస్తారని తెలిపింది..

 

ఫిన్లాండ్ లో మహిళల సారధ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో పిల్లల తల్లులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి సైతం పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫిన్లాండ్ ప్రభుత్వం తెలిపింది. తల్లికి తండ్రికి సమానంగా సెలవలు  ఇవ్వాలని పేర్కొంది. ఈ నిర్ణయంతో లింగ సమానత్వం కూడా ఉంటుందని తెలిపారు.  ప్రస్తుతం ఫిన్లాండ్ లో బిడ్డ పుట్టిన తరువాత భార్య, భర్త ఇద్దరికీ కలిపి 240 సెలవులు ఇస్తారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: