నేటి మంచిమాట.. మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మనసులో పురుషులు 'పసిబిడ్డలు'. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రవీంద్ర నాథ్ ఠాగూర్ చెప్పారు. అయన ఈ మంచిమాట చెప్పిందో ఎప్పుడో అయినా అది ఇప్పటికి నిజమే. ఎందుకంటే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ఒక పురుషుడిని ప్రేమించింది అంటే అతను ఎంత పెద్దవాడు అయినా ఆమెకు చిన్నపిల్లాడిలానే కనిపిస్తాడు. 

 

అంత ప్రేమను ఇస్తుంది ఆమె. అతనికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది ఆమె. అతని కోసం ఎంతైనా కష్టపడుతుంది. అతని ఇష్టాలను గౌరవిస్తుంది. అతనికి అర్ధభాగంగా ఉంటుంది. అతను అనారోగ్యపాలవుతే అతనికి రాత్రిపగులు సేవలు చేస్తుంది. అంత ప్రేమ చూపిస్తుంది అతనిపై అలాంటిది స్త్రీ ప్రేమ. 

 

స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అంత గొప్పగా చూసుకుంటుంది. నిజంగా మీకు అంత గొప్ప భార్య దొరికితే మీరు నిజంగానే అదృష్టవంతులు. కానీ ఇక్కడ ప్రతి పురుషుడు గుర్తించుకోవాలిసిన విషయం ఏంటి అంటే.. మనస్ఫూర్తిగా స్త్రీ ఇష్టపడితే ఎంత ప్రేమ చూపిస్తుందో.. అసహ్యం పెంచుకుంటే అంతేలా నాశనం చేస్తుంది. 

 

విజయానికి అయినా 'స్త్రీ'నే కారణం.. పతనానికి అయినా 'స్త్రీ'నే కారణం. అలాంటి స్త్రీని ఎవరైనా సరే అగౌరవ పరచకండి.. మీకు ఇష్టం ఉంటె వ్యక్త పరచండి.. ఒప్పుకుంటే ముందుకు సాగండి.. లేదంటే అక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేకాని బలవంత పెట్టి శాపాలు పెట్టించుకోకండి.. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీ ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: